Foods to Avoid for Better Sleep : రాత్రుళ్లు త్వరగా నిద్రపోవాలంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే మంచిదే కానీ నిద్ర మాత్రం రాదట
నారింజ ఆరోగ్యకరమైనది. కానీ వాటిలో ఆమ్లం ఎక్కువ. రాత్రి సమయంలో తింటే ఇవి కడుపులో మంట, ఆమ్లతను పెంచుతాయి.
టమాటాలు ఆరోగ్యకరమైనవి. కానీ వాటిలో ఆమ్లం ఎక్కువ. రాత్రి సమయంలో తింటే కడుపులో మంట, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది.
బ్రోకలీ, కాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచివి. కానీ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. రాత్రిపూట తింటే కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలు రావచ్చు.
డార్క్ చాక్లెట్లో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడును మేల్కొల్పుతుంది. దీనిని రాత్రి సమయంలో తింటే నిద్ర రావడానికి ఇబ్బంది కలగవచ్చు.
బాదం, జీడిపప్పు వంటి గింజలు ఆరోగ్యకరమైనవి. కానీ వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిని రాత్రిపూట తింటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కడుపు భారంగా అనిపిస్తుంది.
పెరుగు ఆరోగ్యకరమైనది. కానీ రాత్రి సమయంలో తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ ఏర్పడవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ సమస్యలను కలిగిస్తుంది.
ఎక్కువ మసాలా కలిగిన ఆహారం కడుపులో మంటను పెంచుతుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. నిద్ర సరిగ్గా రాదు.