Asthma Management Tips : ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది
ఆస్తమా సమస్య వాతావరణం కాస్త మారినా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తల్లో ఫుడ్ కూడా ఒకటి.
అవును కొన్నిసార్లు ఫుడ్ కూడా ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. కాబట్టి కొన్ని ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్తమా రోగులు చల్లని, పుల్లని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. కాబట్టి ఐస్ క్రీమ్, సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఆస్తమాను రెట్టింపు చేస్తాయి.
అలాగే ఆస్తమా రోగులు ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. వాటితో పాటు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలంటున్నారు. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
చిప్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్‌లో ఉండే ఫ్యాట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వాటిని కూడా తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.