Airtel Recharge Plans : తక్కువ ఖర్చులో అపరిమిత కాలింగ్.. Airtel 199 ప్లాన్ మంచిదా? 299 బెస్టా?
ఎయిర్‌టెల్ 199 రీఛార్జ్ చేస్తే లోకల్, STD, రోమింగ్ కాల్స్ అపరిమితంగా ఉంటాయి. ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడేవారి కోసం ఇది బెటర్ ఆఫర్. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాబట్టి కాలింగ్ గురించి ఎలాంటి ఆందోళన ఉండదు.
అలాగే 2GB డేటా కూడా వస్తుంది. ఇది మెసేజింగ్ లేదా అప్పుడప్పుడు బ్రౌజింగ్ వంటి తేలికపాటి ఇంటర్నెట్ వినియోగానికి సరిపోతుంది. దీనితో పాటు Airtel స్పామ్ కాల్, మెసేజ్ల నుంచి రక్షించే నెట్వర్క్ కూడా లభిస్తుంది. ఇది అనవసరమైన కాల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వినియోగదారులకు ఉచిత హెలోట్యూన్స్ సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది.
219 రీఛార్జ్ ప్లాన్ అదే సౌకర్యాలతో కొంచెం ఎక్కువ డేటాను అందిస్తుంది. దీని చెల్లుబాటు కూడా 28 రోజులు. ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా ఉంది.
తేడా ఏమిటంటే ఇది 3GB డేటాను అందిస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా, ఆన్లైన్ మ్యాప్లు లేదా అవసరమైన ఇంటర్నెట్ పనులు చేసే వినియోగదారులకు మంచిది. ఈ ప్లాన్ స్పామ్ రక్షణ, హలోట్యూన్స్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.
మొత్తంగా చూస్తే రెండు ప్లాన్‌లు బడ్జెట్ విభాగంలోకి వస్తాయి. రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇంటర్నెట్ వినియోగం పరిమితమై.. కాలింగ్ మీ ప్రాధాన్యత అయితే 199 రూపాయల ప్లాన్ మీకు బాగా సరిపోతుంది.
అదే సమయంలో కొంచెం ఎక్కువ డేటా అవసరమనిపిస్తే.. 219 రూపాయల ప్లాన్ మరింత సమతుల్యంగా ఉంటుంది. అవసరానికి తగినట్లుగా సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది.
జియో వద్ద 3,999.. 3,599 రూపాయల రెండు వార్షిక ప్లాన్‌లు ఉన్నాయి. 3,999 ప్లాన్ గురించి మాట్లాడితే.. అపరిమిత 5G + రోజుకు 2.5GB డేటా.. రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్, 365 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. దీనితో పాటు ఫ్యాన్‌కోడ్, జియోహాట్‌స్టార్ మూడు నెలల సభ్యత్వం, 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సభ్యత్వం ఉచితంగా అందిస్తున్నారు. 3,599 ప్లాన్‌లో ఫ్యాన్‌కోడ్ సభ్యత్వాన్ని మినహాయిస్తే అన్ని ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి.