Air Passenger Rights in India : విమానంలో ప్రయాణిస్తుంటే మీకు కొన్ని హక్కులు ఉంటాయో తెలుసా? రిఫండ్ ఆప్షన్ కూడా
విమానం సమయానికి రాకపోవడం లేదా అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. ఆ పరిస్థితుల్లో విమానయాన సంస్థ ప్రయాణికులు రిలాక్స్ అయ్యేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తుంది. ఇవి చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలాగే ఓవర్ బుకింగ్ కారణంగా సీటు లభించకపోవడం లేదా బోర్డింగ్ దగ్గర నిరాకరించడం వంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అలాంటి ప్రయాణికులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ సమయంలో విమాన కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలి లేదా ప్రయాణికుడికి తదుపరి విమానం టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ విమానాశ్రయంలో లేదా ప్రయాణంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వస్తే.. ప్రయాణికుడిని ఒంటరిగా వదిలివేయకూడదు. ఎయిర్‌లైన్, విమానాశ్రయ అధికారులు ఇద్దరూ తక్షణ వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ఇదిక్కు చాలా ముఖ్యం.
ప్రయాణంలో సామాను పోవడం లేదా పాడైపోవడం కూడా పెద్ద సమస్యే. ఆ సమయంలో విమానయాన సంస్థ నష్టానికి బాధ్యత వహించాలనే నియమం ఉంది. ప్రయాణికుడికి నష్టపరిహారం లేదా పరిహారం ద్వారా పొందే హక్కు ఉంది. కంపెనీ దీనిని తప్పనిసరిగా పాటించాలి.
టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా ప్రయాణికులు డబ్బుల విషయంలో ఫీల్ అవుతారు. అవి రావని భావిస్తారు. కానీ నిబంధనల ప్రకారం విమానయాన వాపసు కోత ఒక నిర్దిష్ట పరిమితిని మించకూడదు. ప్రయాణికుడు తన హక్కుల ప్రకారం వాపసును క్లెయిమ్ చేయవచ్చు. లేదా కంప్లైయింట్ ఇవ్వొచ్చు.
అందుకే విమానంలో ప్రయాణించేవారికి తమ హక్కుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమాచారం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఈ ఇబ్బందుల నుంచి రక్షించుకోవచ్చు. అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.