AC Tips for Monsoon : వర్షాకాలంలో AC ఉష్ణోగ్రత ఎంత ఉంచుకోవాలో తెలుసా? కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఫాలో అయిపోండి
చాలా మందికి వర్షాకాలంలో ఏసీని ఎలా ఉపయోగించాలో తెలియదు. చాలా మంది వేసవిలో ఉంచే అదే ఉష్ణోగ్రతను పెట్టి ఏసీ వాడుతారు. 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చల్లగా ఉండడంతో పాటు విద్యుత్ బిల్లు కూడా నియంత్రణలో ఉంటుంది.
కానీ వర్షాకాలంలో ఈ పద్ధతి సరైనదికాదట. వర్షాకాలంలో గాలిలో తేమ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత వద్ద AC నడపడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సీజన్లో ఎంత ఉష్ణోగ్రత సరైనదో తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది. ఈ పరిధిలో తేమ నియంత్రణలో ఉంటుంది. గదిలో చల్లదనం కూడా ఉంటుంది. ఇది ఏసీపై ఎక్కువ ఒత్తిడిని కూడా కలిగించదు.
దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. AC కూడా సరిగ్గా ఉంటుంది. చాలా మంది తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేయడం ద్వారా గది త్వరగా చల్లబడుతుందని అనుకుంటారు. కానీ వర్షాకాలంలో AC వేడిని మాత్రమే కాకుండా తేమను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల చాలా చల్లని ఉష్ణోగ్రతను ఉంచడం వల్ల ACపై ఎక్కువ భారం పడుతుంది.
వేసవిలో ఉపయోగించినట్లే ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గదిలో తేమ కూడా ఎక్కువ అవుతుంది. మీ ACలో డ్రై మోడ్ ఉంటే.. వర్షాకాలంలో దాన్ని ఉపయోగించండి. ఈ మోడ్ తేమను తగ్గించి గదిని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
వర్షాకాలంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. అందుకే ఏసీని నిరంతరం నడపాల్సిన అవసరం లేదు. మీరు పగటిపూట కొన్ని గంటలు రన్ చేయవచ్చు. ఏసీ వేసినప్పుడు ఇంట్లో కిటికీలు, తలుపులు సరిగ్గా మూసుకోండి. తద్వారా తక్కువ సమయంలో మంచి కూలింగ్ పొందవచ్చు.