Coconut Water : కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే ఇవి తినకూడదట.. ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు

కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత తినకూడని ఫుడ్స్ ఇవే
కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. దీనిని తాగిన తర్వాత టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తీసుకుంటే జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. కొందరికి కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.
కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత పాలు లేదా పెరుగు తీసుకుంటే కొందరిలో అజీర్తి సమస్యలు కనిపించొచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు కొంత గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది.
కొబ్బరి నీళ్లు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. వెంటనే మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే కడుపులో అసౌకర్యం, యాసిడ్ సమస్యలు రావచ్చు.
సోడాలు, కోల్డ్ డ్రింక్స్ వంటి పానీయాలు కొబ్బరి నీళ్లలోని సహజమైన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌ని డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తే.. ఇవి డీహైడ్రేషన్‌కు దారితీయొచ్చు. అందుకే వెంటనే ఇలాంటి స్నాక్స్ తినకపోవడం మంచిది.
కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఆల్కహాల్ మాత్రం డీహైడ్రేట్ చేస్తుంది. రెండింటిని కలిపి తీసుకుంటే శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ వంటి హెవీ మీల్స్ తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించొచ్చు. కనీసం 20 నుంచి 30 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.