Herbal Teas : బలాన్ని పెంచి.. కొలెస్ట్రాల్ను తగ్గించే హెర్బల్ డ్రింక్స్ ఇవే.. ఈ 5 డ్రింక్స్ ట్రై చేయండి
ముదురు ఎరుపు రంగు కలిగిన మందార టీ గుండెకు చాలా మేలు చేస్తుందని చెప్తున్నారు. ఒక క్లినికల్ ట్రయల్లో అధిక రక్తపోటు ఉన్న 65 మందికి 6 వారాల పాటు రోజుకు మూడు కప్పుల మందార టీ ఇచ్చారు. తరువాత ఫలితాలలో వారి సిస్టోలిక్ రక్తపోటు బాగా తగ్గిందని తేలింది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, రక్తపోటు రెండింటినీ నియంత్రించడంలో సహాయపడతాయి.
గ్రీన్ టీలో ఉండే కేటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వాపు తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
రెడ్ బుష్ టీ అని కూడా పిలిచే రూయిబోస్ టీ కెఫిన్ రహితం. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా నిండి ఉంటుంది. ఇందులో ఉండే ఎస్పాలాథిన్, నోటోఫాగిన్ వంటి సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక పరిశోధనలో రోజుకు 200 నుంచి 1200 మిల్లీలీటర్ల రూయిబోస్ టీ తాగడం వల్ల శరీరంలోని లిపిడ్ ప్రొఫైల్, రక్తంలో చక్కెర స్థాయి మెరుగుపరిచిందని కనుగొన్నారు.
చమేల్ టీ సాధారణంగా రిలాక్సేషన్, నిద్ర కోసం ప్రసిద్ధి చెందింది. కానీ ఇది గుండె ఆరోగ్యానికి కూడా అంతే ఉపయోగకరమైనదిగా చెప్తారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అపిజెనిన్, లూటిన్, క్వెర్సెటిన్ వంటివి వాపును తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
అల్లం హెర్బల్ టీలో ఉండే జింజరాల్, షోగోల్ వంటి సమ్మేళనాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఈ హెర్బల్ టీ రక్తపోటును సమతుల్యం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.