Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీలో 90 ప్లాంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా... ఈ నియామకం పురుషులకు మాత్రమే. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 90 పోస్టులలో 53 పోస్టులు మెకానికల్ విభాగం, 37 పోస్టులు ఎలక్ట్రికల్ విభాగం కోసం కేటాయించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెకానికల్ ట్రేడ్ లో సాధారణ వర్గానికి 14, ఎస్సీకి 9, ఎస్టీకి 11, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్ కోసం 5 పోస్టులు కేటాయించబడ్డాయి. అదే విధంగా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో సాధారణ వర్గానికి 10, ఎస్సీకి 6, ఎస్టీకి 7, ఓబీసీకి 10, ఈడబ్ల్యూఎస్ కు 4 పోస్టులు లభించాయి. రెండు ట్రేడ్ లను కలిపి సాధారణ వర్గానికి 24, ఎస్సీకి 15, ఎస్టీకి 18, ఓబీసీకి 24, ఈడబ్ల్యూఎస్ కు 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య 90.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్ వంటి ట్రేడ్‌లలో రెగ్యులర్ ఐటిఐ (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఐటిఐలో కూడా కనీస మార్కుల నిబంధన ఉంది. దీనిలో జనరల్ కేటగిర, MP OBC అభ్యర్థులకు 65% మార్కులు ఉండాలి. అయితే MPPGCL ఉద్యోగులకు ఇది 60% గా ఉంది. SC, ST, EWS, PwBD అభ్యర్థులకు కనీస మార్కులు 55% ఉండాలని చెప్పారు.
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే... జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1200 రూపాయలు, MP నివాసి SC, ST, OBC (నాన్-క్రీమీ లేయర్), EWS, PWD కేటగిరీలకు చెందిన వారికి 600 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
పరీక్షా విధానాన్ని పరిశీలిస్తే... కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 75 ప్రశ్నలు సంబంధిత ట్రేడ్ అంటే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ నుంచి మరియు 25 ప్రశ్నలు సాధారణ జ్ఞానం, సాధారణ సామర్థ్యం నుంచి ఉంటాయి. మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఉంటుంది. ఇది అన్ని అభ్యర్థులకు అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది.
CBT లో వచ్చిన మర్క్స్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అందులో ఉన్న వారు సెలక్షన్ అవుతారు. వేతనం గురించి చెప్పాలంటే... సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,300 రూపాయల నుండి 80,500 రూపాయల వరకు ఉంటుంది.