Vithika Varun Photos : కలర్ఫుల్గా ఉన్న వరుణ్ సందేశ్, వితికా షేరు.. ఫోటోలు చూశారా
వరుణ్ సందేశ్, వితికా షేరు తమ సంక్రాంతి అంగరంగవైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఫోటోలకు క్యూట్ ఫోజులిస్తూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.(Image Source : Instagram/vithikasheru)
హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం సినిమాలతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న వరుణ్.. తర్వాత చాలా సినిమాలు చేశాడు. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హిట్ సినిమాలు మాత్రం ఆయనకు పడలేదు. కానీ హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తూ అలరిస్తున్నాడు. (Image Source : Instagram/vithikasheru)
వితికా షేరు మోడల్‌గా తన కేరీర్ ప్రారంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. అనంతరం హీరోయిన్గా మారి పలు సినిమాలు చేసింది. ఇప్పటికీ తన రీల్స్, యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.(Image Source : Instagram/vithikasheru)
వరుణ్, వితికా కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను పెద్దలవరకు తీసుకెళ్లి.. వారిని ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం ఇద్దరూ సినిమాలు వదిలేసి అమెరికా వెళ్లి అక్కడే కొంతకాలం గడిపారు.(Image Source : Instagram/vithikasheru)
అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చి కెరీర్ మీద కాన్సంట్రేట్ చేస్తున్న సమయంలో బిగ్‌బాస్ అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి జంటగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మొదటిసారి తెలుగులో జంటగా అడుగుపెట్టింది వీరిద్దరే.(Image Source : Instagram/vithikasheru)
బిగ్‌బాస్ సమయంలో వీరిద్దరికీ మంచి ఫేమ్ వచ్చింది. వితికా కాస్త నెగిటివిటీని మూటకట్టుకోగా.. వరుణ్‌కి ప్రజల్లో బాగా సానుభూతి పెరిగిపోయింది. ఈ జంట బయటకు వచ్చిన తర్వాత ఒకరు సినిమాల్లో.. మరొకరు యూట్యూబ్‌లో తమ సత్తా చూపించారు.(Image Source : Instagram/vithikasheru)
వితికాషేరు తన యూట్యూబ్ ఛానల్లో పలు వీడియోలు చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్‌లో వచ్చిన నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చుకుంది. అంతేకాకుండా తన ఫిట్నెస్ గోల్స్‌ను ఫాలో అవుతూ ఈ భామ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.(Image Source : Instagram/vithikasheru)