Satyabhama Serial Nandini: హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన 'సత్యభామ' సీరియల్ ఫేం నందిని గురించి ఈ విషయాలు తెలుసా?
Here is About Satyabhama Serial Fame Nandini: బుల్లితెరపై సీరియల్స్‌కి ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తున్న ఈ సీరియల్స్ ద్వారా ఎంతో నటీనటులు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.
బుల్లితెర సీరియల్స్‌లో అత్యంత ఆదరణ పొందని సీరియల్స్‌లో సత్యభామ ఒకటి. స్టార్ మా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్సీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన నటీనటులందరికి మంచి గుర్తింపు ఉంది.
లీడ్ యాక్టర్స్ క్రిష్, సత్య, రుద్ర, భైరవి, మహదేవయ్య పాత్రలతో గుర్తింపు పొంది రోల్ నందిని. హీరో క్రిష్ చెల్లెలిగా, పొగరుబోతు ఆడపడుచుగా నందిని తన నటనతో ఆకట్టుకుంటుంది.
కుటుంబం నుంచి భర్తను వేరుగా తీసుకువెళ్లాలని, భర్తను ఇల్లరికం తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుంది నందిని. ఈ క్రమంలో శోభనం జరగకుండ భర్తను ఊరిస్తుంది, అలాగే పోగరుగా మాట్లాడుతూ అత్తింటి వారిని ఇబ్బంది పెడుతుంది.
అలా తన నెగిటివ్ రోల్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న నందిని అసలు పేరు యామిని. ఈమే పుట్టిపెరిగిందంతా వైజాగ్‌లోనే. అక్కడే స్కూలింగ్ చేసిన ఆమె ఇంజనీరింగ్ చదివింది. నటనపై ఆసక్తి ఉన్న యామిని మొదటి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత వెబ్ సిరీస్‌తో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన యామిని, పెళ్లయిన కొత్తలో ఇట్లు నీ బావ, నా పేరు యామిని, హౌజ్ వైఫ్ వంటి షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో యామిని సీరియల్స్ ఆఫర్స్ అందుకుంది.
దీంతో జీ తెలుగులో వచ్చిన హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌తో బుల్లితెర ఆరంగేట్రం చేసింది. దీనితో పాటు రంగులరాత్నం, కన్యాదానం, శుభస్య శీఘ్రం సీరియల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ సీరియల్స్‌తో వచ్చిన గుర్తింపుతో స్టార్ మాలో సత్యభామ సీరియల్ ఆఫర్ కొట్టేసింది.
ఇందులో నందినిగా పోగరు బోతు ఆడపడుచుకుగా నటిస్తున్న ఆమె తన అందం, అభినయంతోనూ ఓ వర్గం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ మధ్య ఈ నందిని పాత్ర పాజిటివ్‌గా మారి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.