Brahmamudi Deepika Rangaraju: గోల గోల చేసే బ్రహ్మముడి కావ్య (దీపిక) వెనుక ఇంత బాధ ఉందా!
బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు. కుటుంబ బాధ్యతలు మొత్తం తానే మోస్తూ వచ్చిన సమస్యలను సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తూ బరువైన పాత్రలో ఇరగదీస్తోంది
సీరియల్ లో కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న పాత్రలో కనిపించే దీపిక స్మాల్ స్క్రీన్ పై ఏదైనా షోకి హాజరైతే చాలు గోల గోల చేస్తుంటుంది. ఒక్కసారి ఆలోచించకుండా మాట్లాడి సారీ చెప్పిన సందర్భాలూ ఉన్నాయ్
ఇంత అల్లరిగా కనిపించే దీపిక తన లైఫ్ లో ఉన్న బాధ గురించి చెప్పుకొచ్చింది. ఆహాలో ప్రసారమవుతున్న ఓ షోలో పాల్గొన్న దీపిక మనం ఏం చేసినా ప్రోత్సహించేవాళ్లు అవసరం కానీ నాకు అలాంటివాళ్లు ఎవరూ లేరని బాధపడింది
యాక్టింగ్ మానేసి ఇంట్లో ఉండి చదువుకుని, ఉద్యోగం చేస్తే నా వాళ్లు నాకు హారతి పడతారు. యాక్టింగ్ వాళ్లకు ఇష్టంలేదు. అలాగని వద్దని చెప్పలేదు, సపోర్ట్ కూడా చేయలేదని చెప్పుకొచ్చింది
ఒంటరిగా ఉంటూ నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఇలా అడుగులు ముందుకేస్తున్నా అని బాధ చెప్పుకుంది దీపిక.