Saikiran Sravanthi wedding: సీరియల్ నటి స్రవంతితో 'నువ్వేకావాలి' హీరో సాయికిరణ్ వివాహం!
ఒకప్పటి సింగర్ రామకృష్ణ తనయుడు సాయికిరణ్. సింగర్ సుశీలకు మనవడి వరుస. నువ్వేకావాలి సినిమాలో అనగనగా ఆకాశం ఉందంటూ యూత్ ని ఉర్రూతలూగించాడు సాయికిరణ్...ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు
ప్రేమించు, దేవి, మనసుంటే చాలు సహా దాదాపు 25 సినిమాల్లో నటించాడు సాయికిరణ్. ఆ తర్వాత ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ లో మెప్పిస్తున్నాడు.
కోయిలమ్మ సీరియల్ లో సింగర్ గా నటించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు...ఆ తర్వాత గుప్పెడంత మనసులో రిషి తండ్రి క్యారెక్టర్లో అదరగొట్టేశాడు. ప్రస్సుతం వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు సాయికిరణ్ పెళ్లిచేసుకుంటున్న స్రవంతి.. కోయిలమ్మ సీరియల్ లో వదిన క్యారెక్టర్లో నటించింది. కెరీర్ ఒడిదొడుకులు ఉన్న టైమ్ లో భార్య విడాకులు ఇచ్చేసింది..కొన్నాళ్ల పాటూ ఒంటరిగా ఉన్న సాయికిరణ్..ఇప్పుడు స్రవంతిని జీవితంలోకి ఆహ్వానించాడు
తెలుగుతో పాటూ మలయాళం సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు సాయికిరణ్. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు సాయికిరణ్.