సత్యభామ అక్టోబరు 04 ఎపిసోడ్ హైలెట్స్: సత్యకు చక్రవర్తి నిజం చెబుతాడా - వెంటాడుతున్న మహదేవయ్య!
చక్రవర్తి కొడుకు ఫారిన్ లో చదువుతున్నాడని తెలిసి సత్య...తనలో ఉన్నది మీ బాబాయ్ రక్తం అందుకే బుద్ధిమంతుడిగా చదువుకుంటున్నాడు అంటుంది. అంటే నాలో ఉన్నది మా బాపురక్తం కాబట్టి నాకు చదువుఎక్కలేదు అంటావా అంటాడు క్రిష్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచదువు రాకపోతే ఏమైంది నా కొడుక్కి ఏం తక్కువ అంటుంది భైరవి...అలా చెప్పమ్మా..నన్ను ఏమన్నా భరిస్తాను కానీ బాపుని అంటే ఊరుకోను అంటాడు క్రిష్
చక్రవర్తి తని చేయికడుక్కునేందుకు వెళ్లినప్పుడు అనుసరించిన సత్య.. మీకు క్రిష్ అంటే చాలా ఇష్టమా అంకుల్..తనపై మీరు చూపించేంత ఆపేక్ష ఇక్కడెవరూ చూపించరు అంటుంది. అదేంటి వాళ్ల అమ్మా నాన్న ఉన్నారుగా అంటాడు చక్రవర్తి.. మీరు ఏమైనా అనుకోండి ఇదే నిజం అన్న సత్య..తనగురించి ఇన్‌ఫర్మేషన్ కావాలంటుంది కానీ చక్రవర్తి మాత్రం తనకేం తెలియదు అనేసి వెళ్లిపోతాడు.
ఇంతలో అక్కడకు వచ్చిన మహదేవయ్య చాలా ఫాస్ట్ గా ఉన్నావ్ అంటే.. సమాజంలో పెద్దమనిషి అనే పేరున్న వ్యక్తితో కదా పోటీపడుతున్నా ఆమాత్రం ఉండాలంటుంది. క్రిష్ అసలు తండ్రి ఎవరో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు అన్న మహదేవయ్యతో..మీరు తండ్రి కాదు అని తెలుసుకున్నా కదా అది చాలు మీ పతనానికి అని రిప్లై ఇస్తుంది
మంచంపై పూలు చల్లుతున్న క్రిష్ ని మరింత ఆటపట్టిస్తుంది సత్య. నేను పుట్టిన సంవత్సరం మాత్రమే కాదు.. డేట్ , నెల కూడా తెలుసుకోవాలంటూ మరో ఫజిల్ ఇస్తుంది
నా చేతిలో అధికారం నువ్వు తీసుకున్నావ్ అని భైరవి..సత్యపై ఫైర్ అవుతుంది.. బాధ్యతలు కొడలికి ఇచ్చేయ్ అంటాడు మహదేవయ్య. నన్ను బిజీ చేస్తే మీతో ఛాలెంజ్ మర్చిపోతా అనుకుంటున్నారా ..తగ్గేదే లే అంటూ మరోసారి ఛాలెంజ్ చేస్తుంది సత్య..
అక్క సీమంతం ఘనంగా చేద్దామని సత్య అంటే..నాకిష్టం లేదంటాడు రుద్ర. నువ్వింకా మారదాలేదా అని క్రిష్ క్వశ్చ్ చేస్తాడు.. అయినా మనకు ఎందుకులే క్రిష్ అని సత్య అడ్డుపుల్ల వేస్తుంది.
మన పరాయివాళ్లమా అని క్రిష్ మాటలకు.. మావయ్యకు బావగారంటే ప్రత్యేక ప్రేమ అని సెటైర్ వేస్తుంది.... సత్యభామ అక్టోబరు 05 ఎపిసోడ్ లో ఇదే హైలెట్..