Satyabhama Today October 17th Episode Highlights: రుద్ర కుట్ర కనిపెట్టేసిన సత్య - హర్ష కోసం తెగించేసిన మైత్రి -సత్యభామ అక్టోబరు 17 ఎపిసోడ్ హైలెట్స్!
పండుగ కోసం క్రిష్ ఇంటిని అలంకరిస్తుంటాడు. సత్య రావడం చూసి పడిపోయేలా యాక్షన్ చేయడంతో సత్య పట్టుకుంటుంది. ఓ సాంగేసుకుంటారు క్రిష్ - సత్య..ముద్దిమ్మని సత్యని అడిగితే..మావయ్య వచ్చారంటుంది. వెంటనే వదిలేస్తాడు క్రిష్.. నవ్వుతుంది సత్య. తనని ఆటపట్టించేందుకు అలా చెప్పిందని తెలిసి సత్యను దగ్గరగా తీసుకుంటాడు.
ఈ సారి నిజంగానే మహదేవయ్య, భైరవి వస్తారు.. హర్ష నందిని రావడం చూసి క్రిష్ సంతోషంగా ఆహ్వానిస్తాడు. ఎలా ఉన్నావని తల్లి భైరవి అడిగితే...అత్తింట్లో ఉన్నాకదా బావున్నా అంటుంది నందిని. ఇప్పుడు ఇంటికి కళ వచ్చింది అంటుంది జయమ్మ.
చిన్న అన్నయ్య పిలిచాడు కదా రాకుండా ఎలా ఉంటానంటే.. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని వాడితో కాల్ చేయించా అని కవర్ చేస్తుంది భైరవి. రేణుకని పలకరించి బాధపడుతుంది నందిని. ఇది ఎవరు చేసిన పనో నాకు తెలుసు అంటుంది. అంతా రుద్రవైపు చూస్తారు. ఫైర్ అయిన రుద్ర.. దీన్ని ఎవడు పిలిచాడు అంటాడు. ఈ ఇల్లు చిన్న అన్నది కూడా ..ఏం బాపూ వాడికి చెప్పు అంటుంది నందిని.
నువ్వు గొడవలు పెడదాం అనుకున్నా కుదరనివ్వను అంటాడు మహదేవయ్య..మీ బాణాన్ని మీపైకే ఎక్కుపెడతా హ్యాపీ దసరా అనేసి ఇంట్లోకి వెళ్లిపోతుంది సత్య
ఇంట్లో బామ్మ తప్ప ఎవ్వరూ లేరని తెలిసి హర్ష రూమ్ లోకి వెళ్లిన మైత్రి.. తన షర్ట్ వేసుకుని..నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు అనుకుంటుంది.
బొమ్మల కొలువు పెట్టి సత్య, నందిని, రేణుక సంతోషంగా ఉంటారు. పేరంటానికి వచ్చిన ముత్తైదువులు రేణుకని గొడ్రాలు అని అవమానిస్తారు. సత్య ఫైర్ అవుతుంది.
హర్షని రప్పించేందుకు కళ్లు తిరిగినట్టు యాక్షన్ చేస్తుంది మైత్రి.. ఆ విషయం తెలుసుకున్న హర్ష వెంటనే బయలుదేరుతా అంటాడు.. నందిని కూడా ఆ వెనుకే వెళుతుంది.
పేరంటాలకు వాయనం ఇచ్చేందుకు రమ్మంటే రేణుక రాదు.. రావణ దహనంలో రేణుకకు నిప్పంటించే సీన్ సత్యభామ అక్టోబరు 18 ఎపిసోడ్ లో రాబోతోంది...