Satyabhama Today October 15th Episode Highlights: మహదేవయ్య ఏడవలేని నవ్వు - సత్యతో మరో సవాల్ ..సత్యభామ అక్టోబరు 15 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్య ఇంట్లో దసరా సంబరాలు జరుగుతాయి. భైరవి, రేణుక, సత్య..తమ భర్తలకి తలంటుపోస్తారు... సత్యకి క్రిష్ ఐలవ్‌యూ చెప్పి హగ్ చేసుకుంటాడు.. ఇంతలో జయమ్మ రావడంతో ఫైర్ అవుతాడు..ఎప్పుడూ అడ్డమే అంటూ సరదాగా కోప్పడతాడు
మరోవైపు మైత్రి నందిని ఇచ్చిన చీరకట్టుకుని పూలు కోస్తుంటుంది.. వెనుక నుంచి హర్ష హగ్ చేసుకుంటాడు..అరవబోతుంటే నోరు మూసేస్తాడు. ఇంతలో నందిని వచ్చి అరిచించి నేను అంటుంది...షాక్ అయిన హర్ష ...మైత్రికి సారీ చెప్పేసి వెళ్లిపోతాడు.. ఇక ఆ చీర తగలబెట్టేయాలి అనుకుంటుంది నందిని
సత్యను ఇరికించేందుకు ఆయుధపూజ కోడలు చేస్తుందని మహదేవయ్య అంటే భైరవి రివర్సవుతుంది. అమ్మతోనే చేయిస్తే మంచిదని రుద్ర అంటాడు. ఇంతలో మీడియావాళ్లు రావడంతో అంతా మహదేవయ్యే పిలిచాడు అనుకుంటారు..ఇంతలో సత్య వచ్చి నేనే పిలిచాను అంటుంది.
ఒకప్పుడు రాతి గుండె ఉన్న మహదేవయ్య ఇప్పుడు జాలిగుండె ఉన్న మనిషి.. తన కూతుర్ని ఓ పేదింటికి కోడలిగా పంపి ఆ పేద ఇంటి నుంచి నన్ను తెచ్చుకున్నారు..ఈ రోజు ఆయుధ పూజ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.. సెక్యూరిటీతో కాకుండా జనం మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు అంటూ...మహదేవయ్య వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు ఇచ్చేస్తుంది
ఆయుధాలన్నీ ఇచ్చేస్తే మాకెలా నడుస్తుందని రుద్ర ఫైర్ అవుతాడు. భైరవి కూడా సత్యని టార్గెట్ చేస్తుంది.
ఇంతలో వచ్చిన రేణుక.. చేతిలో ఆయుధాలు లేకుండా బతికితేనే బతుకు విలువ తెలుస్తుంది అంటుంది. రుద్ర..రేణుకని కొట్టేందుకు వెళితే క్రిష్ ఆపుతాడు.. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది..
సత్యభామ అక్టోబరు 16 ఎపిసోడ్ లో... నాతో ఆయుధాలు సరెండర్ చేయించడం గెలుపు అనుకుంటున్నావా.. రేపు ఈ సమయానికి అంతకన్నా ఎక్కువ ఆయుధాలు నా ఇంట్లో ఉంటాయ్ చూస్తావా అంటాడు.. నీ చిన్న కొడుకు చూస్తాడు అని సత్య అంటే వాడిని ఎలా దారికితెచ్చుకోవాలో తెలుసు అంటాడు మహదేవయ్య..త్వరలో మీ నిజస్వరూపం క్రిష్ కి తెలిసేలా చేస్తానంటుంది సత్య...