Satyabhama Today October 14th Episode Highlights: 'వినయ విధేయ రామ' సీన్ రిపీట్ - సత్యని చంపేందుకు గన్ ఎక్కుపెట్టిన రుద్ర!
మహదేవయ్య ఇంటికి పండగొచ్చింది.. వినయ విధేయ రామ సాంగ్ బ్యాక్ డ్రాప్ లో సేమ్ సీన్ అలానే దించేశారు. క్రిష్ - సత్య సంబరం.. రేణుక బాధను దిగమింగుకున్నా రుద్రలో కక్ష...సత్యపై లోపల రగిలిపోతూ బయటకు డ్రామా ప్లే చేస్తున్న మహదేవయ్య.. అక్టోబరు 14 సోమవారం సత్యభామ ఎపిసోడ్ లో ఇవే హైలెట్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపండుగ సందడి ఓ వైపు..ఇంట్లో అంతా ఆనందంగా ఉన్న టైమ్ లో రుద్ర మరోసారి సత్యను టార్గెట్ చేశాడు. ఎన్నిసార్లు వద్దని చెప్పినా తన భార్యకు తనకు మధ్య అడ్డొస్తున్నావంటూ ఫార్ అవుతాడు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరుగుతుంది...
తన భార్య కడుపులో బిడ్డను కాపాడుకుంటానని నాతో ప్రతిజ్ఞ చేశావ్..ఏం చేయగలిగావ్ ఇక నీ పని కూడా ఔట్ అంటూ సత్యపైకి గన్ ఎక్కుపెడతాడు రుద్ర.. ఈ సన్నివేశాన్ని క్రిష్ కానీ చూస్తే కథ మరోలా ఉంటుంది..
సత్య కూడా ఎక్కడా తగ్గకుండా దూసుకెళుతోంది.. ఓవైపు మహదేవయ్యతో ఛాలెంజ్ చేయడమే కాదు...క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. అటు రేణుకకు జరిగిన అన్యాయంపై పోరాటం కూడా సాగించేలా ఉంది..
తోడికోడలు రేణుకను వదిలించుకోవాలనుకుంటున్న ఆమె భర్త రుద్రకి ఎలా బుద్ధి చెబుతుంది... మహదేవయ్యని ప్రాణంగా ప్రేమిస్తున్న కొడుకు కానీ కొడుకు క్రిష్ ని ఆ ఉచ్చులోంచి బయటకు తీసుకొచ్చేందుకు ఎలాంటి స్టెప్ వేస్తుందో ఈ వారం హైలెట్ కాబోతోంది
హర్షను అర్థం చేసుకుని నందిని దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది కానీ మైత్రి మాత్రం కుట్రలు చేస్తూనే ఉంది. ఈ వారంలో ఆమెను ఉన్నత చదువుల కోసం ఫారెన్ పంపించాలని ప్లాన్ చేస్తున్నారు.. మైత్రి తప్పించుకునేందుకు చూస్తోంది..ఈ వ్యవహారంతో నందిని - మధ్య ఎలాంటి నిప్పు రగులుతుందో చూడాలి...