Satyabhama Serial March 8th Final Episode Highlights: సత్యభామ అయిపోయింది.. మహదేవయ్యలో మార్పొచ్చింది.. సంజయ్ కి చెక్ పెట్టేసిన క్రిష్!
తన తల్లిని చంపింది మహదేవయ్యే అని తెలిసి క్రిష్ కోపంగా వెళతాడు. మహదేవయ్యతో తలపడతాడు కానీ చంపలేక ఆగిపోతాడు. నన్ను చంపెయ్ బాపు..ఎప్పటికీ నా తండ్రివి నువ్వే అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మహదేవయ్య కూడా ఏడుస్తూ పోరా అనేస్తాడు
నా బ్రేస్ లెట్ ఏమైపోయింది అనుకుంటాడు.. అప్పట్లో మహదేవయ్య తనకు ఆ బ్రాస్ లెట్ ఇచ్చి ఇది నీ చేతికి ఉంటే నీతో ఉన్నట్టే అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు..దానికోసం ఇంటికి వెళతాడు
అరే సంజయ్ చూడరా వాడు..నన్ను చంపేంత కోపం లేదట నా చేతిలో చచ్చేంత ప్రేమ ఉందట. కన్నతల్లిని చంపినోడికి ప్రాణభిక్ష పెట్టాడు వాడికి ఎందుకురా నేనంటే అంత పిచ్చి అంటాడు. నువ్వు నా కన్న కొడుకువే వాడే నాకు గొప్పగా కనిపిస్తున్నాడు ..నేను తప్పుచేశాను అని బాధపడతాడు.
వాడు నాకు కావాలి నీక్కూడా కోపం వాడిపై కోపం ఉంటే తీసెయ్ వాడిని తీసుకురా అంటాడు. అంటే నీ కొడుకు స్థానాన్ని త్యాగం చేయమంటున్నావ్ కదా అని అయితే నువ్వు నా కోసం త్యాగం చేయి అంటూ కత్తి తీస్తాడు.
రుద్రని జైలుకి పంపించింది నేనే..నీ ప్రాణం పోయినా నాకు లెక్కలేదు ఈ కోట కావాలి...నాకోసం చచ్చిపో డాడ్ అంటూ చంపేందుకు ప్రయత్నిస్తాడు. భైరవి సహా ఇంట్లో అందరూ వచ్చి బతిమలాడినా వినడు. ఇంతలో క్రిష్ వచ్చి కత్తికి అడ్డం నిలబడతాడు
నీ కొడుకుని కొట్టినందుకు క్షమించు అని మహదేవయ్యను అడుగుతాడు. మళ్లీ మహదేవయ్యని చంపేందుకు వస్తే మహదేవయ్య కాలితో తంతాడు.. క్రిష్ నీకు తెలుసుకదా ఏం చేయాలో అని సైగ చేస్తాడు మహదేవయ్య. భైరవి కూడా నేను తప్పుచేశాను క్రిష్ అని బాధపడుతుంది
వచ్చే జన్మలో వీడు మన కొడుకుగా పుట్టాలి అని ఏడుస్తారు మహదేవయ్య, భైరవి. నన్ను మీ తమ్ముడికి ఇచ్చేస్తావా అని క్రిష్ ఏడుస్తాడు. ఇద్దరూ హగ్ చేసుకుని కన్నీళ్లు పెడతారు. ఇద్దరి మాటలు విని అక్కడున్నవారంతా నవ్వుకుంటారు. మహదేవయ్య, భైరవి ఇద్దరూ సత్యకి క్షమాపణలు చెబుతారు
నా సంగతి తేల్చండని సంజయ్ అంటే.. ఆస్తి మొత్తం నువ్వు తీసుకుని అమ్మానాన్నకి నాకు ఇచ్చెయ్ అంటాడు. అప్పటికి సంజయ్ లో మార్పు వస్తుంది.. నాక్కూడా ఆస్తి వద్దు అమ్మానాన్న కావాలి అంటాడు. సంధ్యని ప్రేమగా చూసుకుంటా అంటాడు
అందరూ కలసిపోయారు ...శుభం కార్డ్ పడింది...