Satyabhama Serial February 26th Episode Highlights: మహదేవయ్యా చివరకు మిగిలేది బూడిదే.. సరికొత్తగా మొదలైన క్రిష్ ప్రస్థానం - సత్యభామ ఫిబ్రవరి 26 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్య క్రిష్ ను గెంటేస్తాడు..అసలైన తండ్రి చక్రవర్తితో కలసి వెళ్లిపోతాడు క్రిష్. గతంలో మహదేవయ్య అన్న మాటలన్నీ గుర్తుచేసుకుని బాధపడతాడు. సత్య ఓదార్చుతుంది..
క్రిష్ - సత్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో రేణుక, జయమ్మ తలోమూల కూర్చుని ఏడుస్తారు. భైరవి మాత్రం సంజయ్ కి ప్రేమగా తినిపిస్తూ సంతోషంగా ఉంటుంది. క్రిష్ సత్య ఉన్న ఫొటో చూసి కిందకు విసిరికొడతాడు మహదేవయ్య.
ఎక్కడికి వచ్చాం అని క్రిష్ అంటే..మనింటికి వచ్చాం అని చెబుతాడు చక్రవర్తి. తొలిసారి నా కొడుకు, కోడలు వచ్చారు కానీ హారతిచ్చే మనిషి లేదంటూ బాధపడతాడు. మీరు సరే అంటే నేను హారతి ఇస్తాను అంటాడు. చక్రవర్తి హారతిచ్చి లోపలకు ఆహ్వానిస్తాడు.
నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను-మీ అమ్మ చాలా కలలు కన్నాం..నిన్ను డాక్టర్ ని చేయాలి , ఫారిన్ పంపించాలి అనుకున్నాం అంటాడు. అసలేం జరిగిందంటే అని సత్య చెప్పబోతుంది. పురిటినొప్పులతో చనిపోయిందని అబద్ధం చెప్పి..చక్రవర్తికి చెప్పొద్దని సైగ చేస్తుంది
ఈ ఇంట్లో నాకు అత్యంత ముఖ్యమైన గది ఉంది చూపిస్తాను రండి అంటూ తీసుకెళ్లి క్రిష్ ఫొటోలు గిఫ్ట్‌లు ఉన్న రూమ్ చూపిస్తాడు. నిన్ను నేను దూరం చేసుకోలేదురా..నిన్నటివరకూ నేను అందరూ ఉన్న అనాధని..దేవుడు ఇంత పెద్ద అదృష్టం ఇస్తాడు అనుకోలేదంటాడు.
పాతికేళ్ల నా కల ఒక్క సారి నాన్న అని పిలవు అని అంటే.. తను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు కొంచెం టైం ఇవ్వండి మామయ్య అంటుంది సత్య.
బాధని దిగమింగుకుని తన బిడ్డని నీ చేతిలో పెట్టిన నీ తమ్ముడికి దండం పెట్టాలిరా నువ్వు..నా కొడుకు కాదని పాతికేళ్లతర్వాత గెంటేసినా వాడు వెళ్లిపోయాడు. తప్పొఒప్పో వాడిని నీ స్వార్ధానికి వాడుకున్నావ్ కనీసం మర్యాదగా పంపాలి కదరా..ఆ చిన్నా గాడి ఉసురు నీకు తగులుతుందంటుంది జయమ్మ
ఏ తల్లీ కొడుకుకు ఇలా శపించదు కానీ ఆ దౌర్భాగ్యం నాకు తగ్గింది..ఈ ఇంట్లో నేను కూడా ఉండాలో వద్దో నీ కొడుకులతో మాట్లాడి చెప్పు.. నన్నుకూడా మెడపట్టి గెంటేయకముందే వెళ్లిపోతాను. కానీ తల్లిగా ఒకటి అడుగుతున్నా నాకు తలకొరివి మాత్రం నువ్వు పెట్టొద్దు అంటుంది.
నేను ఆ రోజు అన్నయ్యని ఏదిరించాల్సింది అంటాడు చక్రీ. గతం నుంచి బయటకు రాలేకపోతున్నా అని బాధపడతాడు క్రిష్. నాన్న అని పిలిచేందుకు కొంచెం టైమ్ కావాలి అంటాడు. ఓదార్చిన సత్యని నువ్వు నా బాధ నీకేం తెలుసు నా మనిషికి కాదనేస్తాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని సారీ చెబుతాడు
నా వాళ్లు నన్ను మోసం చేశారని క్రిష్ బాధపడుతుంటే మోసం చేసినవాళ్లు నీ వాళ్లు అవరు అంటుంది. నేను ఫీలైనట్టే బాపు కూడా ఫీలవుతాడు కాసేపట్లో ఫోన్ చేస్తాడు అంటాడు. నాన్నా అని పిలవలేకపోతున్నా సారీ అని చక్రీకి చెబుతాడు