Premaku Jai Movie: పల్లెటూరిలో జరిగిన వాస్తవ సంఘటనలతో 'ప్రేమకు జై'... రిలీజ్‌కు రెడీ

పల్లెటూరి 'ప్రేమకు జై' అని ప్రేక్షకులు అంటరాని ఆశిస్తూ...
అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమకు జై'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వం వహించారు. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ పతాకం మీద అనసూర్య నిర్మించారు. ఇటీవల హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం అని అన్నారు.
'ప్రేమకు జై' ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న దర్శక నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ... ప్రేక్షకులు బడ్జెట్, ఆర్టిస్ట్ వంటివి చూడకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమాను అయినా సరే బ్లాక్ బస్టర్ చేస్తారు. అటువంటి హిట్ సినిమాల లిస్టులో 'ప్రేమకు జై' చేరుతుందని ఆశిస్తున్నాను. పాటలు, ట్రైలర్, పిక్చరైజేషన్ బాగున్నాయి. దర్శకుడు మల్లం శ్రీనివాస్ చక్కగా తీశారు. సినిమా హిట్ అవుతుంది'' అని అన్నారు.
'ప్రేమకు జై' సహ నిర్మాత మైలారం రాజు మాట్లాడుతూ... ''యువతకు నచ్చే కథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. వచ్చే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.
అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్. ఈ చిత్రానికి ఎడిటర్: సామ్రాట్, సినిమాటోగ్రాఫర్: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం రాజేష్, సహ నిర్మాత: మైలారం రాజు, నిర్మాత: అనసూర్య, కథ - దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.