Satyabhama Serial Today September 30th: సత్య - క్రిష్ కి మళ్లీ ఫస్ట్ నైట్ , రుద్ర - మహదేవయ్య కుట్ర .. సత్యభామ సీరియల్ సెప్టెంబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్య కుట్రను బయటపెట్టేందుకు సత్య వేసిన తొలి అడుగు ఫ్లాప్ అయింది. దాడిచేసిన రౌడీ బొమ్మ గీసి పోలీసులకు ఇస్తుంది కానీ... వాడిని పోలీసులు పట్టుకునేలోగా మహదేవయ్య చంపేస్తాడు. ఎవర్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని విర్రవీగుతాడు మహదేవయ్య. ఇప్పుడే కదా మొదలుపెట్టాను అలవాటు పడతాను రాటుదేలుతా అని సత్య సవాల్ చేస్తుంది.
ఎప్పటిలా సత్య - క్రిష్ ఫస్ట్ నైట్ కి హడావుడి మొదలైంది. ముహూర్తంతో సంబంధం లేదు మీరిద్దరూ ఒక్కటవ్వాల్సిందే అంటుంది క్రిష్ బామ్మ. సత్యను ఆటపట్టిస్తాడు క్రిష్..
ప్రతిసారీ సత్య-క్రిష్ ఒక్కటయ్యేందుకు ముహూర్తం నిర్ణయించండం..ఏదో ఒక కుట్రతో ఫ్లాప్ అవడం జరుగుతోంది. అయితే ఈ సారి ఇంట్లో తన భర్తకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి సత్యకు తెలుసుకాబట్టి..వాటిని ఎదుర్కొంటుందేమో చూడాలి....
మహదేవయ్యకి వ్యతిరేకంగా మాట్లాడి భర్త దృష్టిలో చెడు అయ్యేకన్నా...సపోర్ట్ గా ఉంటూనే మహదేవయ్య, రుద్ర కుట్రల్ని బయటపెట్టే ప్లాన్లో ఉంది సత్యభామ.
సత్య-క్రిష్ సంతోషం చూసి మహదేవయ్య పెద్ద కొడుకు రుద్ర రగిలిపోతాడు. తెలివైన సత్యభామ తమ బండారాన్ని బయటపెడుతుందనే భయంతో ఉన్న రుద్ర..ఆమెను చంపేద్దాం అని మహదేవయ్యతో అంటాడు
మొత్తానికి ...మళ్లీ క్రిష్-సత్య ఫస్ట్ నైట్ హడావుడి ఓవైపు.. సత్యను చంపే కుట్రలో మహదేవయ్య - రుద్ర మరోవైపు.. సెప్టెంబరు 30 సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ సీన్స్ ఇవే...