Chiranjeevi Balakrishna: టాలీవుడ్ లెజెండ్స్ ఇద్దరూ ఒక్క ఫ్రేములో - IIFA Awards 2024లో రేర్ మూమెంట్
మెగాస్టార్ చిరంజీవిని 'అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్' అవార్డుతో సత్కరించింది ఐఫా ఉత్సవం. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐఫా 2024లో ప్రముఖ హిందీ నటి షబానా అజ్మీ, రచయిత జావేద్ అక్తర్ చేతులు మీదగా ఆయనకు అందజేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను 'గోల్డెన్ లెగసీ' అవార్డుతో ఐఫా 2024 సత్కరించింది. ఈ వేడుకలో టాలీవుడ్ లెజెండ్స్ చిరు, బాలయ్య ఆత్మీయంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
చిరంజీవి, బాలకృష్ణకు తోడు విక్టరీ వెంకటేష్ కూడా ఐఫా ఉత్సవం 2024లో సందడి చేశారు. ఈ ముగ్గురూ వేదిక మీద కలిశారు.
ఇటీవల హైదరాబాద్ సిటీలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ ఈవెంట్ లోనూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కలిశారు.
ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ తీసుకున్న నటుడు జయరామ్. ఈ కేరళ స్టార్ తెలుగు సినిమాలూ చేశారు. 'అల వైకుంఠపురములో', 'హాయ్ నాన్న' ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
ఐఫా 2024లో చిరంజీవి