Satyabhama Serial Today September 19th: సత్యకు తెలిసిన నిజం క్రిష్ కి చెబుతుందా - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్యపై హత్యాప్రయత్నం చేసిన రౌడీలను క్రిష్ అడ్డుకుంటాడు..మహదేవయ్యకి దిగాల్సిన కత్తిపోటుకి అడ్డువెళ్లడంతో క్రిష్ ని పొడిచేస్తారు.. క్రిష్ ని చూసి సత్య అల్లాడిపోతుంది
దూరంగా ఉంటే తనని అనుమానిస్తారని భావించిన రుద్ర..రౌడీలపై అటాక్ చేస్తున్నట్టు నటిస్తుంటాడు..మరోవైపు క్రిష్ ప్రాణాపాయంలో ఉన్నాడని హాస్పిటల్ కి తీసుకెళదామని సత్య ప్రాధేయపడుతుంటుంది
తండ్రిని చంపేయాలని రుద్ర ప్రయత్నిస్తుంటే..భర్తని కాపాడుకోవాలని సత్య ప్రయత్నాలు చేస్తుంటుంది. అప్పుడు కూడా క్రిష్..అన్నా బాపుని చంపాలి అనుకున్నవారిని వదలొద్దంటూ మాట్లాడుతూనే ఉంటాడు
ఎవరూ సహాయం చేసేందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్రిష్ ని తీసుకుని సత్య హాస్పిటల్ కి వెళుతుంది. సంపంగి సంపంగి అంటూ కార్లో మగతగా కలవరిస్తూనే ఉంటాడు క్రిష్..నీకేం కాదంటూ సత్య కంగారుగా కారు డ్రైవ్ చేస్తుంటుంది
సమయానికి హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తుంది..తన భర్తకి ఏమీ కాకూడదని భగవంతుడిని వేడుకుంటుంది సత్య. ఈలోగా మహదేవయ్య సహా కుటుంబం మొత్తం హాస్పిటల్ కి వస్తారు. హాస్పిటల్లో సిగరెట్ కాల్చేందుకు ప్రయత్నించిన రుద్రని నర్స్ వారించడంతో గొడవకు దిగుతాడు..అది రూల్ పాటించాల్సిందే అని సత్య చెబుతుంది
రౌడీలు నేరుగా తన రూమ్ కే ఎలా వచ్చారనే అనుమానం మహదేవయ్యలో మొదలవుతుంది..రుద్ర షాక్ అవుతాడు. సెప్టెంబరు 20 శుక్రవారం ఎపిసోడ్ లో క్లారిటీ రావాల్సిఉంది..