Satyabhama Serial Today October 1st: క్రిష్-సత్య రొమాన్స్.. స్పాట్ పెట్టిన రుద్ర - సత్యభామ అక్టోబరు 01 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్ చేతిగాయం చూసి సత్య కన్నీళ్లుపెట్టుకుంటుంది. ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంటికి రాగానే గాయం గురించి ఎందుకు చెప్పలేదని ఫైర్ అవుతుంది. నేను కోప్పడతానని ఈ విషయం చెప్పలేదు..కానీ నీపై కోపంతో కాదు ప్రేమతో అరుస్తాను అది గుర్తించు అని క్లారిటీ ఇస్తుంది
నేను రాక్షసిని కాదు...నాకు మనసుంది..నీకు ఏదైనా జరిగితే బాధపడతాను..నా గురించి ఆలోచించే తీరిక నీకు ఉండకపోవచ్చు కానీ నాకున్న పని ఒక్కటే నీ గురించి ఆలోచించడం అని ఎమోషనల్ అవుతుంది
ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చిన సత్యతో..నాకు కాఫీ వద్దు ముద్దు కావాలని సత్యను ఆటపట్టిస్తాడు. అప్పుడకు వచ్చిన తన నానమ్మతో ఏంటే ముసలి కళ్లుమూసుకో అంటాడు. ఆ తర్వాత జయమ్మ పంచాంగం చూసి క్రిష్ - సత్య ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టాలి అనుకుంటుంది
ముహూర్తాలతో సంబంధం లేదు మీ బాధ మీరు పడండి అంటుంది జయమ్మ. నాకు కూతురు పుడితే నీ పేరే పెట్టుకుంటా ముసలి అంటాడు క్రిష్.
క్రిష్-సత్య సంబంరం చూసిన మహదేవయ్య-రుద్ర కుళ్లుకుంటారు. ఇద్దర్నీ విడదీయాలని మహదేవయ్య అనుకుంటే సత్యను చంపేద్దాం అంటాడు రుద్ర
అక్టోబరు 02 బుధవారం ఎపిసోడ్ లో హైలెట్ సీన్ ఉండబోతోంది. సత్యకు కాల్ చేసిన క్రిష్ అసలు తండ్రి తన కొడుకు బాగోగుల గురించి మాట్లాడుతాడు. ఇంట్లోకి వచ్చిన తమ్ముడిని చూసి షాక్ అవుతాడు మహదేవయ్య..ఎందుకొచ్చావ్ అంటే నేనే పిలిచాను అంటూ ఎంట్రీ ఇస్తుంది సత్య...