Satyabhama Serial Today November 19th Highlights :సత్య ప్లాన్ సక్సెస్.. క్రిష్ విషయంలో బయటపడిన చక్రీ - సత్యభామ నవంబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!
హర్ష కోసం ఆశగా ఎదురుచూస్తుంది నందిని..కానీ తను రాగానే మైత్రి గురించి ఆలోచనలో పడతాడు. ఆ విషయం తెలుసుకుని ఊగిపోయిన నందిని హర్షని రూమ్ లోంచి బయటకు తోసేస్తుంది..హర్ష లేచెళ్లి నానమ్మ పక్కన కూర్చుంటాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచక్రవర్తి ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు..అక్కడకు వస్తాడు సంజయ్. సరదాగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నా రెండు కోట్లు ఇవ్వండి అంటాడు. కెరీర్ని ఎవరూ సరదాగా తీుకోరు..నా బిజినెస్ చూసుకో కొత్తగా ఏమీ వద్దు అనేస్తాడు. రేపటికల్లా రెండు కోట్లు కావాలి అంతే అనేసి వెళ్లిపోతాడు
ఇంతలో ఎంట్రీ ఇచ్చిన సత్య.. కొందరిని సొంతం అనుకున్నా మనసు ఒప్పుకోదు..కొందర్ని దూరం పెట్టాలి అనుకున్నా ప్రాణం ఆగదు అంటుంది. సంజయ్ తో మాట్లాడడం ఇష్టంలేదా..తను డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వలేదంటుంది సత్య..అదే క్రిష్ 5 కోట్లు అడిగితే ఇచ్చారని గుర్తుచేస్తుంది. మీరు నా నుంచి ఏదో రహస్యం దాస్తున్నారు..27 ఏళ్ల క్రితం జరిగిన బిడ్డల మార్పిడి గురించి చెప్పండి అని షాక్ ఇస్తుంది.
మీ కన్న కొడుకుని లాక్కుని తన కొడుకుని మీ చేతిలో పెట్టారు మీ అన్నయ్య మహదేవయ్య..మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు..ఏదో ఓ రోజు క్రిష్ కి నిజం తెలుస్తుందంటుంది. ఇంట్లో ఎన్ని జరిగినా పట్టించుకోని మీరు క్రిష్ కి బుల్లెట్ తగలగానే వచ్చేశారు అంటూ నిలదీస్తుంది. క్రిష్ ని కాపాడుకోవాలి అనుకుంటున్నా సపోర్ట్ చేయండి మావయ్య అంటుంది..కానీ చక్రీ ఏమీ సమధానం చెప్పకుండా వెళ్లిపోతాడు.
నిద్ర పట్టక నందిని బయటకు వచ్చి చూస్తే నానమ్మ పక్కన నిద్రపోతాడు హర్ష. శాంతమ్మపై నీళ్లు చల్లిన నందిని మనవడికి సర్ది చెప్పి పంపించలేదు ఎందుకని నిలదీస్తుంది. అప్పుడు శాంతమ్మ చెప్పడంతో లోపలకు వెళ్లిన హర్ష..మరోసారి మైత్రి ప్రస్తావన తీసుకురానంటూ గుంజీలు తీస్తాడు..
చక్రవర్తి చెప్పిన మాటలను ఆలోచిస్తుంటుంది సత్య..ఇంతలో క్రిష్ వచ్చి బాబాయ్ డబ్బులు ఇవ్వడంతో MLA టికెట్ వచ్చేసిందని బాబాయ్ ని ఇంట్లోనే ఉండమని చెప్పు అంటాడు. మీరు చెప్తే వింటారు అంటుంది సత్య. మీ కన్నా మీ బాబాయ్ కి ఎవరూ ఇష్టం లేదని సత్య అంటే మా బాపు కన్నా నేను ఎవరికీ ఇష్టం ఉండదంటాడు
రేపు నీకు ఓ గుడ్ న్యూస్ చెబుతాను అనుకుంటుంది సత్య.. క్రిష్ మాట్లాడుతూనే ఉంటాడు సత్య నిద్రపోతుంది...
పొద్దున్నే సంధ్యని ట్రాప్ చేసేందుకు వెళతాడు సంజయ్.. సంధ్య నంబర్ తీసుకోవాలని భావించి ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. దేవుడు మనల్ని కలుపుతూనే ఉన్నాడంటూ మొదలెడతాడు.
సత్యభామ నవంబరు 20 ఎపిసోడ్ లో చక్రవర్తి తన కొడుకు గురించి బయటపడిపోతాడు. సత్య కాల్ చేసి మీ కొడుకుని ఎవరో కత్తితో పొడిచేశారు అంటుంది..వెంటనేవచ్చిన చక్రీ..నా కొడుకు క్రిష్ ఎలా ఉన్నాడంటూ మాట్లాడేస్తాడు. నేను మీ కొడుకు సంజయ్ గురించి మాట్లాడితే మీరేంటి క్రిష్ గురించి టెన్షన్ పడుతున్నారంటుంది...