✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today January 8th Highlights: క్రిష్ vs మహదేవయ్య.. సత్యకి గుడ్ న్యూస్ , రుద్రకి కౌంట్ డౌన్ - సత్యభామ జనవరి 8 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  08 Jan 2025 09:52 AM (IST)
1

సత్య, నందిని కలసి నామినేషన్ల పేపర్లో సంతకాలకోసం తిరుగుతారు. ఇంతలో నర్సింహ ఎంట్రీ ఇచ్చి..మీ మావయ్యను కాదని నాతో చేతులు కలుపు నీకు వందమందితో సంతకాలు పెట్టిస్తా అంటాడు. మామధ్య ఉన్నది సిద్ధాంతాల వైరమే కానీ వ్యక్తిగత వైరం కాదంటుంది సత్య. ఈసారి వరంగల్ MLA అయ్యేది మహదేవయ్య ఇంటి నుంచి ఎవరో ఒకరు అంటుంది

2

మా మావయ్యని ఓడించేందుకు శత్రువుతో చేయికలిపే కుసంస్కారం లేదంటుంది. నర్సింహకు క్లాస్ వేస్తుంది సత్య. ఇదంతా దూరం నుంచి వింటాడు క్రిష్. సత్యను చూసి మురిసిపోతాడు

3

నర్సింహంతో చేతులు కలుపుతావు అనుకున్నా అంటాడు క్రిష్. పరిస్థితులను బట్టి మారేదాన్ని క్యారెక్టర్ అనరు అవకాశవాదం అంటారు. నేను స్వార్థంకోసం కాదు..సిద్ధాంతం కోసం అంటుంది. మొత్తం విన్నా నీపై గౌరవం పెరిగింది అంటాడు క్రిష్. మరి పార్టీ మారి వదినకు సహాయం చేస్తున్నావా అడుగు వదినా అంటుంది నందిని.

4

నాకు కావాల్సింది అడిగితే చేసే సహాయం కాదు ఇష్టంతో చేసే సహాయం. నేను నోరు తెరిచి అడిగితే మీ అన్నయ్య నాకోసం ఏదైనా చేస్తాడు...అలాగని అడిగి ఇబ్బందిపెట్టాలి అనుకోవడం లేదంటుంది. నిన్ను వదిన అర్థం చేసుకున్నంత బాగా వేరే ఎవ్వరూ అర్థంచేసుకోరు మీ బాపూ కూడా అని సెటైర్ వేస్తుంది నందిని.

5

సంధ్య ఫోన్ చూసుకుంటూ ఉంటుంది..ఇంతలో హర్ష వచ్చి పిలుస్తాడు.. సంధ్య కళ్లుమూసుకుని ఉండడం చూసి ఫోన్ లాక్కుంటాడు. నందిని ఏది అని అడిగితే.. అక్కతో కలసి రోడ్లపై తిరుగుతోందంటూ నందినిపై కంప్లైంట్ చేస్తుంది. వదిన పద్ధతి బాలేదు.. బయటకు ఏమీ అనలేకపోయినా అమ్మ లోపల చాలా బాధపడుతోందంటుంది.

6

ఇంతలో నందిని రావడం చూసి...అదిగో వస్తోంది నాలుగు జాడించు అంటుంది. వదినను ఆపేస్తే కథ ఇక్కడే ఆగిపోతుంది నాకు సమస్యే ఉండదు అనుకుంటుంది సంధ్య. హర్ష నందినికి క్లాస్ వేస్తాడు.. నీకు ఎలాగూ సపోర్ట్ చేసే దమ్ము లేదు నేను వదిన వెంటే ఉండి తీరుతా అంటుంది నందిని.

7

ఇంటికి చేరుకున్న తర్వాత.. నువ్వు ముందు వెళ్లు తర్వాత నేను వస్తానంటుంది. నాతో కలసి వస్తే అందరూ నిన్ను అవమానిస్తారు అది చూసి తట్టుకోలేను అంటుంది సత్య. నిన్ను కూడా అందరూ క్వశ్చన్ చేస్తారని క్రిష్ చెబితే నేను ఎవరితోనూ గొడవపెట్టుకోను అని మాటిస్తుంది

8

లోపలకు వెళ్లిన సత్యపై రుద్ర సెటైర్ వేస్తాడు. సత్యకి నందిని తప్ప ఇంకెవరు సపోర్ట్ చేసినా నా చెప్పుతో నేను కొట్టుకుంటా అంటుంది. జయమ్మ చెప్పు తీసుకొచ్చి భైరవికి ఇస్తుంది..నీ చెప్పే ఇది నువ్వు కొట్టుకో నేను సత్యకి సపోర్ట్ చేస్తున్నా అంటుంది. అంతా షాక్ అవుతారు.

9

వాళ్లు ఇంతలా హింసిస్తున్నా ఎందుకు ఎదురుతిరగడం లేదంటుంది జయమ్మ. నాకు ఇష్టమైన క్రిష్ ని, తనకి ఇష్టమైన కన్నవాళ్లని దూరం చేసుకోలేను అంటుంది సత్య. ఎన్నో తంటాలు పడితే ఇద్దరు దొరికారంటాడు మహదేవయ్య.. ఇద్దరు కాదు.. ఒకరు మీరు జన్మనిచ్చినోళ్లు, మరోకరు మీకు జన్మనిచ్చిన వాళ్లు అంటుంది.

10

సత్యభామ జనవరి 09 ఎపిసోడ్ లో... సత్య నామినేషన్ పేపర్లపై సంతకాలు చేసేందుకు ముందుకొచ్చాం అంటుంది ఓ మహిళ. ఆరుగురుం సంతకం చేస్తాం అని చెప్పడంతో సత్య సంతోషంగా ఫీలవుతుంది. ఓల్డెజ్ హోమ్ లో ముసలాళ్లు సత్యవెనుక నిలబడకూడదని మహదేవయ్య అంటే వాళ్ల సంగతి నేను చూసుకుంటా అంటాడు రుద్ర...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today January 8th Highlights: క్రిష్ vs మహదేవయ్య.. సత్యకి గుడ్ న్యూస్ , రుద్రకి కౌంట్ డౌన్ - సత్యభామ జనవరి 8 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.