Satyabhama Serial Today December 10 Highlights :సత్యతో చెడుగుడు ఆడుకుంటున్న మహదేవయ్య .. ఇప్పుడుంటుంది అసలు ఆట - సత్యభామ డిసెంబరు 10 ఎపిసోడ్ హైలెట్స్!
సత్యభామ తన పుట్టింటికి వెళ్లేందుకు బయలుదేరుతుంది..కావాలనే భైరవి అడ్డుపడుతుంది. ఇంతలో జయమ్మ వచ్చి భైరవికి క్లాస్ వేస్తుంది. ప్రతిసారీ నా కొడలిని సపోర్ట్ చేసి నన్ను తక్కువ చేస్తున్నావ్ అంటుంది. అయినా భైరవి ఒప్పుకోదు...
ఇంతలో ఎంట్రీ ఇచ్చిన క్రిష్..ఏమైందని అడుగుతాడు. పుట్టింటికి వెళ్లాలని అత్తయ్యను అడిగాను అంటుంది. సరే పద నేను దింపుతా అంటాడు. నేను వద్దన్నా అంటుంది భైరవి..పది రోజులు ఉండిపోయేందుకు వెళ్లడంలేదు పోయిరానీ అంటాడు క్రిష్. పుట్టింట్లో నా అవసరం ఉంది వెళ్లాలి అని రిక్వెస్ట్ చేసి వెళ్లిపోతుంది
ఇల్లు తాకట్టుపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు విశ్వనాథం. 25 లక్షలు అప్పు కావాలని అడుగుతాడు. అగ్రిమెంట్ పై సైన్ చేయాల్సి ఉంటుందంటాడు సేటు. ఇంతలో సత్య ఎంట్రీ ఇస్తుంది. ఏం జరుగుతోందని అడుగుతుంది.
అవసరం ఉన్నప్పుడు మేం ఎందుకు గుర్తుకురాలేదు మావయ్య అని క్రిష్ అడుగుతాడు..ఇది చిన్న విషయం అని విశాలాక్షి అంటుంది. ఏం జరిగిందంటే అని హర్ష చెప్పేలోగా..నేను డబ్బుఇస్తాను ఎంత కావాలని క్రిష్ అడుగుతాడు. బంధుత్వాన్ని ఆర్థిక అవసరాలని కలపకూడదు అంటాడు విశ్వనాథం
నా కొడుకు చేసిన తప్పుని నీ నుంచి డబ్బు తీసుకోవడం సరికాదు..ఇల్లు తాకట్టు పెడుతున్నా ఇందులో సమస్య ఏముంది అంటాడు విశ్వనాథం. సమస్య ఉంది ఈ ఇల్లు నాది అంటూ మరొకడు ఎంట్రీ ఇస్తాడు. ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి రచ్చ చేస్తాడు. నా ఇల్లు ఖాళీ చేయండి అంటాడు.
ఇల్లు నాది అని రచ్చ చేసిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత మహదేవయ్యకి కాల్ చేసి జరిగినదంతా చెబుతాడు. మహదేవయ్య నవ్వుకుంటాడు. మూడు రోజుల్లో వాళ్లని రోడ్డుకి ఈడ్చాలి అంటాడు.
విశ్వనాథం ఇల్లంతా తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంట్లో అంతా ఓదార్చుతారు. ఇంటి విషయంలో కోర్టుకి వెళదాం అంటుంది సత్య. కేసు తేలేవరకూ మనం ఈ ఇంట్లో ఉండకూడదు కదా అంటుంది నందిని. కష్టం మీద కష్టం వస్తోంది దిక్కుతోచడం లేదని విశాలాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది
భైరవి రిలాక్స్ గా కూర్చుంటుంది..ఇంట్లో మీ పవర్ తగ్గిపోయిందంటూ ఆజ్యం పోస్తుంది. చిన్న కోడలిని బయటకు వెళ్లకుండా ఆపలేకపోయారంటుంది. మీరు చిన్న కోడలిని ఇంటికి రప్పించగలిగితే నిండుకుండ అని ఒప్పుకుంటా అంటుంది పనిమనిషి
సత్యభామ డిసెంబరు 11 ఎపిసోడ్ లో...సత్యకు కాల్ చేసిన మహదేవ్యయ... నిండా మునిగావు కదా...తేలాలి అనుకుంటే ఇకపై కుక్కినపేనులా పడి ఉంటానని మాటివ్వు, చిన్నా గాడి తండ్రి ఎవరో తేల్చే ఉద్యమం మూటకట్టి పక్కనపెట్టు అని బెదిరిస్తాడు. సత్య ఆలోచనలో పడుతుంది...