Rithu Chowdary: ఏంటి రీతూ.. షోలో ఇదే పని, బయట కూడా ఇదే పనా? - మరోసారి శేఖర్ మాస్టర్‌తో అలా...
Rithu Chowdary With Shaker Master: బుల్లితెర నటి రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గట్టి హగ్ ఇస్తూ లవ్ యూ చెప్పింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరు ఇటీవల ఓ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో శ్రీముఖి హోస్ట్ 'కిరాక్ బాయ్స్ - కిలాడీ లేడీస్' షోలో పాల్గొన్నారు.
దీనికి శేఖర్ మాస్టర్ జడ్జీగా వ్యవహరించగా.. రీతూ కంటెస్టెంట్స్‌గా వచ్చింది. ఈ షోలో టాస్క్‌ల్లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది ఆమె. ఇటీవల ఈ షోకి శుభం కార్డు కూడా పడిపోయింది.
తాజాగా బయట శేఖర్ మాస్టర్ కలిసి ఆయనతో దిగిన ఫోటోలు షేర్ చేసింది రీతూ.వీటికి 'లవ్ యూ మాస్టర్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే షోలోనూ రితూ శేఖర్ మాస్టర్ ముద్దులు, హగ్‌లు ఇస్తూ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. షోలోనూ ఇదే పని, బయట కూడా ఇదే పనేనా.. అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.