✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల... రెండు ఓటీటీల్లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్

S Niharika   |  30 Aug 2024 03:43 PM (IST)
1

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన సినిమా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఇదొక యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ పులకురం దర్శకుడు. జూన్ 21న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడీ సినిమా రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏయే ఓటీటీల్లో వీక్షకులకు అందుబాటులో ఉందో తెలుసా?

2

'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కొన్ని గంటల క్రితం ఆహా ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం అందులో స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోనూ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది... అమెరికా ఆడియన్స్ కోసం అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇండియన్ ఆడియన్స్ కోసం ఆహా అయితే... అమెరికన్ ఆడియన్స్ కోసం అమెజాన్. అదీ సంగతి. 

3

హీరో హీరోయిన్లు ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్‌తో పాటు పలువురు కొత్త నటీనటులు 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'లో నటించారు. ఓ యువ జంట మధ్య తొలిప్రేమను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఇంటర్మీడియట్ కాలేజ్ నేపథ్యంలో ప్రేమ, ప్రేమికుల మధ్య దూరం, మంచి పాటలు కలిసి సినిమాను హిట్ చేశాయి. ఇప్పుడు ఆహా ఓటీటీలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది.

4

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'లో రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ఛాయాగ్రహణం: నిఖిల్ సురేంద్రన్, కూర్పు: కోదాటి పవన్ కల్యాణ్, పాటలు: కార్తీక్ రోడ్రిగజ్, నేపథ్య సంగీతం: సయ్యద్ కమ్రాన్,నిర్మాణ సంస్థ: బ్లాక్ ఆంట్ పిక్చర్స్, రచన - కూర్పు - దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల... రెండు ఓటీటీల్లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.