Karthika Deepam Premi Vishwanath: మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క!
ప్రేమీ విశ్వనాథ్(Premi Viswanath) అంటే తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరనొచ్చోమో. ఈ పేరు అంత పాపులర్ మరి. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ తో హీరోయిన్స్ ని మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.
మళ్లీ కలుద్దాం అంటూ సీరియల్ ని క్లోజ్ చేశారు. శుభం కార్డు వేయకుండా మళ్లీ కలుద్దాం అనడం,చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో పార్ట్ 2 ఉంటందని ఫిక్సైపోయారు కార్తీకదీపం అభిమానులు. కానీ ఉండకపోవచ్చనే అంటున్నారు.
తెలుగు సీరియల్స్ అన్నీ ఓ లెక్క కార్తీకదీపం మరో లెక్క. బుల్లితెర బాహుబలి గా నిలిచిపోయిందంటే అంత ఆదరణ దక్కించుకుంది మరి. ఈ సీరియల్ సక్సెస్ క్రెడిట్ ఇందులో నటించినవారందరకీ దక్కుతుంది కానీ సింహభాగం మాత్రం వంటలక్క దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్ దే.
కార్తీకదీపం తర్వాత మళ్లీ ఏ సీరియల్ లోనూ కనిపించలేదు ప్రేమీ. దీంతో మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క అని అడుగుతున్నారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)