Karthika Deepam Keerthi Keshav Bhat: బిగ్ బాస్ లోకి 'కార్తీకదీపం' సీనియర్ హిమ, ఇప్పట్లో సీరియల్ లో కనిపించనట్టేనా!

కార్తీకదీపం సీనియర్ హిమ ( కీర్తి కేశవ్ భట్) బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తర్వాత జనరేషన్లో కార్తీదీపం కథ నడిపించారు...మళ్లీ ఏమనుకున్నారో ఏమో చనిపోయిన వాళ్లని బతికించి తీసుకొచ్చి డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత చుట్టూ తిప్పుతున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో సీనియర్ హిమగా నటిస్తోన్న కీర్తి కేశవ్ భట్, సీనియర్ శౌర్య గా నటిస్తోన్న అమూల్య గౌడ హడావుడి లేనట్టేనేమో. పైగా కీర్తి బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెడుతోందని టాక్ రావడంతో ఇంకొన్నాళ్ల పాటూ కార్తీకదీపం కథ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత చుట్టూనే తిరుగుతుందని క్లారిటీ వచ్చేసినట్టే అంటున్నారు ప్రేక్షకులు.

''మనసిచ్చి చూడు'' సీరియల్ విశేష ఆదరణ పొందుతోంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న భాను తన అభినయం, అందంతో బుల్లితెరపై ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ మధ్యే 'కార్తీకదీపం' సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి..హిమ పాత్రలో నటిస్తోంది...
ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నయ్యను కోల్పోయిన ఈమె చాలా బాధను చవిచూసింది. తనకు తానె సర్దిచెప్పుకుని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నటనపై ఉన్న ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి రెండు సినిమాలు,మూడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
. కర్ణాటక బెంగుళూరులో జన్మించిన. BBM కోర్సు పూర్తిచేసింది. ఈమెకు చిన్నతనం నుంచి నటనపై మక్కువ ఎక్కువ.
కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)