Karthika Deepam 2 March 3rd Highlights : జ్యోత్స్నని అందరిముందు కొట్టిన దీప.. శౌర్య జోలికి వస్తే చంపేస్తానంటూ వార్నింగ్, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే

కార్తీక్ వచ్చి రౌడీలను కొట్టి దీపను, శౌర్యను కాపాడుతాడు. దీపను, శౌర్యను ఇంటికి తీసుకెళ్లగా ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. నరసింహ పనే అనుకుంటారు. (Image Credit: Jiostar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మరో వైపు దీప, శౌర్యలు తనని చూసేశారని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. తల్లికి మారిపోయినట్లు.. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నట్లు నమ్మిస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)

శౌర్య, దీపలు ఇంట్లో మాట్లాడుకుంటారు. జ్యోత్స్నే కళ్లకు అడ్డుగు రుమాలు పెట్టిందని చెప్తుంది. జ్యో ఎందుకు ఇలా చేసిందమ్మా అంటూ శౌర్య అడుగుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
దీంతో దీప.. శౌర్యను ఇంట్లోనే ఉండమని చెప్పి.. జ్యోత్స్న ఇంటికి వెళ్తుంది. నా జోలికి వచ్చినా ఊరుకున్నాను. నా కూతురు జోలికి వస్తే ఊరుకోనంటూ ఇంటికి వెళ్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
ఇంట్లోకి రావద్దంటూ పారిజాతం ఆపితే.. ఇంట్లోకి రాకుండా ఈ గడప ఆపితే దానిని పేల్చేస్తానంటూ.. లోపలికి వెళ్లి జ్యోత్స్నని పిలుస్తుంది దీప. దీంతో జ్యో కంగారు పడిపోతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
శౌర్య దగ్గరికి కార్తీక్ రాగా.. జ్యోనే ఈ అటాక్ చేయించింది. ఎందుకు ఇలా చేసింది నాన్న అంటూ అడుగుతుంది. దీప అక్కడికే వెళ్లి ఉంటుందనుకుని కార్తీక్ బయలుదేరుతాడు. (Image Credit: Jiostar/ Star Maa)
కిందకి వచ్చిన జ్యోత్స్నను దీప కొడుతుంది. కాపాడండి డాడీ ఈ దీప నన్ను చంపేస్తుందని దశరథ్ దగ్గరికి వెళ్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)
సుమిత్ర ఏమైందని అడగ్గా.. ఈమె నన్ను, నా కూతురుని చంపాలనుకుంది. అటాక్ చేయించి.. ఇప్పుడు ఏమి ఎరుగనట్టు నాటకమాడుతుందని చెప్పగా అందరూ షాకైపోతారు. (Image Credit: Jiostar/ Star Maa)
ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానుగా మమ్మీ అనేసరికి సుమిత్ర కూడా నమ్మేస్తుంది. దీంతో దీప అబద్ధం చెప్తావా అని కొట్టబోతే.. సుమిత్ర దీపను కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. (Image Credit: Jiostar/ Star Maa)