Karthika Deepam 2 March 18th Highlights : జ్యోత్స్నను ఆస్తికోసం పెళ్లి చేసుకుంటున్న గౌతమ్.. దీపతో లడ్డూ షేర్ చేసుకున్న కార్తీక్, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
గౌతమ్, జ్యోత్స్నల పెళ్లి చూపులతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. పెద్దలందరూ మాట్లాడుకుంటూ.. జ్యోని, గౌతమ్‌ని పర్సనల్‌గా మాట్లాడుకోమంటారు.(Image Credit: jio+ Hotstar)
జ్యోత్స్న, గౌతమ్‌లు బయటకు వెళ్లగా.. అక్కడి గార్డెన్లో గులాబీనిచ్చి గౌతమ్ జ్యోత్స్నకు ప్రపోజ్ చేస్తాడు. నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా అని జ్యో అడుగుతుంది. (Image Credit: jio+ Hotstar)
అవును అని పైకి చెప్తూనే మనసులో ఈ ఆస్తి అంతటికీ నువ్వే వారసురాలివి. నిన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి నాకు వస్తుందని తనలో తానే అనుకుంటాడు. (Image Credit: jio+ Hotstar)
తర్వాత జ్యో, గౌతమ్ లోపలికి వస్తారు. నాలుగురోజుల్లో ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఉందని.. మీకు ఓకే అయితే ఫిక్స్ చేస్తామని చెప్తారు. అలా వారి నిశ్చితార్థాన్ని ఫిక్స్ చేస్తారు.(Image Credit: jio+ Hotstar)
జ్యోత్స్న తన లుక్ మార్చుకోకుండా.. ఆ ముస్తాబులోనే కార్తీక్ ఇంటికి వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే వచ్చిందనుకుంటారు. కాదని చెప్పి అందరికీ స్వీట్స్ ఇస్తుంది.(Image Credit: jio+ Hotstar)
కార్తీక్‌కి ఇచ్చే సరికి స్వీట్స్ అయిపోతాయి. సారీ బావా నీకు ఏమి మిగల్లేదని ఇండైరెక్ట్‌గా చెప్తుంది జ్యోత్స్న. దీంతో నాకు షేర్ చేసుకునేవాళ్లు ఉన్నారులే అంటూ దీప నుంచి లడ్డూ షేర్ చేసుకుంటాడు కార్తీక్.(Image Credit: jio+ Hotstar)
పెళ్లికి ఎవరిని పిలవాలి అనే దానిపై శివన్నారాయణ డిస్కస్ చేస్తాడు. చెల్లిని మిస్ చేశావని దశరథ్ చెప్తే.. అసలు తను నా కూతురే కాదని శివన్నారాయణ చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
నువ్వు ఒక్కడివే నా కొడుకువి. జ్యోత్స్నే నా వారసురాలని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)