Karthika Deepam 2 January 22nd Highlights : దీపకు ఇష్టం లేకుండా రౌడీని తీసుకెళ్లిపోయిన కార్తీక్.. అమ్మకు చెప్పొద్దంటూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసేశాడుగా
ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ దీప దగ్గరకు వచ్చి.. రౌడీని వారం బయటకు తీసుకెళ్తున్నాని తన డ్రెస్లు సర్దమని చెప్తాడు. తనను బయటకు పంపడం ఇష్టం లేదని అంటూనే శౌర్య బట్టలు సర్దుతుంది దీప. (Images Source : Star MAA)
అన్ని సర్దిన తర్వాత వెళ్తుంటే నేను పాపను పంపను అని ఏడుస్తుంది దీప. దీంతో తన నాకు కూతురే. నా కూతురుకి మంచి జరుగుతుందనే కదా నేను తీసుకెళ్లాలనుకుంది. నువ్వు ఇలా చేస్తే ఎలా అంటూ కార్తీక్ చెప్పగా.. శౌర్య కూడా నాన్న చెప్పాడుగా అమ్మ వెళ్లి వచ్చేస్తానంటూ దీపకు సర్ది చెప్తుంది. (Images Source : Star MAA)
శౌర్య నానమ్మకి బాయ్ చెప్పి బయలుదేరుతుంది. రౌడీని ఫ్రెండ్ ఇంట్లో పెట్టడానికి కారణం ఏంటో తెలీదు. పాపకి గుండె సమస్య ఉంది శౌర్యని తీసుకెళ్లి డబ్బు కూడా తీసుకెళ్లారంటే ఏదో అనుమానంగా ఉందని అనసూయ చెప్తుంది. కార్తీక్ వచ్చిన తర్వాత దీపకి తెలీకుండా అడుగుతానని అంటుంది. (Images Source : Star MAA)
కార్తీక్ అమ్మవారి దగ్గరకి శౌర్యని తీసుకెళ్లి దండం పెట్టిస్తాడు. నేను నిన్ను వదిలేసి ఎక్కడా ఉండను అని రౌడీ చెప్పగానే కార్తీక్ కన్నీరు పెట్టుకుని పాపని హగ్ చేసుకుంటాడు. నాన్న ఏం చెప్పినా సరే అనమన్నావ్ అందుకే సరే అన్నాను కానీ నాకు ఎవరి ఇంటికి వెళ్లాలి అని లేదు అని శౌర్య అంటుంది. శౌర్య మాటలకు కార్తీక్ ఏడుస్తాడు.(Images Source : Star MAA)
కార్తీక్ పాపని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. కాశీ కూడా అక్కడే ఉంటాడు. శౌర్యని కాశీ దగ్గర ఉంచి డబ్బు కట్టేసి రూమ్ తీసుకుంటాడు. హాస్పిటల్‌కి ఎందుకు తీసుకొచ్చావ్ అని కార్తీక్‌ని శౌర్య అడగ్గా నువ్వు వారం ఇక్కడే ఉంటావని చెప్తాడు. (Images Source : Star MAA)
రోజూ నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నావ్ కదా అందుకే డాక్టర్‌కి చెప్పాను దాంతో నీకు టెస్టులు చేస్తారని అప్పుడు మందులు వేసుకోవడం అవసరం లేదని అంటాడు. ఈ విషయం అమ్మతో చెప్పొద్దని ప్రామిస్ వేయించుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. (Images Source : Star MAA)