Karthika Deepam 2 February 7th Highlights : కార్తీక దీపం 2 హైలైట్స్.. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్ ఇచ్చిన దీప.. అడ్డువస్తే చెంప పగలగొడతానంటూ ఇచ్చిపడేసిందిగా
శివ నారయణ ఇంటికి దీప వెళ్తుంది. దీంతో అక్కడే ఆగు లోపలికి రావొద్దు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి అంటూ శివనారాయణ ఆపుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
నీ కూతురు ఎలా ఉందని అడుగుతాడు. అలాగే నీ భర్త నన్ను అనరాని మాటలు అన్నాడు. ఇంటి గడప కూడా తొక్కనంటూ వెళ్లాడు. నువ్వెేలా లోపలికి వస్తావంటూ అడుగుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
శివ నారాయణకు శౌర్య బాగానే ఉందని.. ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కాంచన గారు ఈ హోమం చేస్తున్నారని.. నా కూతురికి మీరు అక్షింతలు వేస్తే బాగుంటుందని చెప్తుంది దీప. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
నా భర్త మాటే నా మాట. ఇంట్లోకి నేను రాలేను. కానీ.. ఇంటి గుమ్మాన్ని లక్ష్మి అంటారు కదా.. అందుకే గుమ్మానికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాను అంటూ కన్నీటితో చెప్తోంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఈ విషయాన్ని జ్యోత్స్న డైజిస్ట్ చేసుకోలేక.. దీప పెట్టిన బొట్టును తొక్కుకుంటూ బయటకు వస్తుంది. పాపకు ఆపరేషన్ ఎవరు చేయించారు.. డబ్బు ఎవరిచ్చారు అంటూ అడుగుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కార్తీక్ బాబే చేయించాడని చెప్పడంతో షాక్ అవుతుంది. అంతేకాకుండా నేను రెండు కుటుంబాలని కలపాలని చూస్తున్నాను. నువ్వు అడ్డు వస్తే నీ చెంప పగలగొడతానంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది దీప. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
అనంతరం కావేరి ఇంటికి వెళ్తుంది దీప. మీరు చేసిన సహాయానికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను అంటూ దీప ఎమోషనల్ అవుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కావేరికి కుంకుమ పెట్టి హోమంకి రమ్మన్ని పిలవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)