Karthika Deepam 2 February 3rd Highlights : కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే.. శౌర్యని కాపాడుకోలేకపోతున్నామని కన్నీటి పర్యంతమైన కార్తీక్, దీప.. ఆపరేషన్ డబ్బు కట్టేసిన అజ్ఞాతవాసి
కార్తీక్, దీపల దగ్గరికి వెళ్లి.. శౌర్య ఆపరేషన్ విషయంలో తాను చేసిన పని గురించి చెప్తుంది జ్యోత్స్న. ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలిస్తే నన్ను ఇంట్లోనుంచి బయటకు పంపేస్తారంటూ భయపడుతుంది. అలాగే కార్తీక్, ఆస్తి నాకు రెండు కావాలని.. పారిజాతంతో చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కార్తీక్ చాలామందికి ఫోన్లు చేసి.. డబ్బులకోసం బతిమాలుతాడు. కానీ ఎవరూ రెస్పాండ్ కారు. దీంతో కార్తీక్ పేదరికం తల్లిదండ్రులకు కష్టమే కానీ.. పిల్లలకు శాపం అంటూ ఏడుస్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దాంతో దీప మరింత కృంగిపోయి.. కార్తీక్‌కి చేతులతో మొక్కి.. నా పాపను ఎలా అయినా కాపాడండి అంటూ వేడుకుంటుంది. ఏమి చేయలేని స్థితిలో కార్తీక్ కూడా ఏడుస్తూ ఉంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
పిల్లల్ని కాపాడుకోలేని పరిస్థితి ఎవరికి రాకూడదు దీప. పాపను చూడాలన్నా నిన్ను చూడాలన్నా నాకు భయంగా ఉంది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు దీప అంటూ వేడుకుంటాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఇంతలో కావేరి దీప దగ్గరకు వస్తుంది. శివన్నారాయణ గారు పాపని ఎందుకు ఇలా వదిలేశారో అర్థం కావడం లేదని చెప్తుంది. నా మనవరాలికి ఏమి కాదంటూ దీపకు భరోసా ఇస్తుంది. దీప మాత్రం మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ.. నా ధైర్యం ఎప్పుడో చచ్చిపోయిందని అనుకుంటుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఆపరేషన్ టైమ్ అయిపోయింది.. శౌర్యని తీసుకుని వెళ్లిపోదాం బాబు అని దీప అంటే కార్తీక్ చాలా ఏడుస్తాడు. పాప ముఖం చూడలేనని.. పాప అడిగితే ఏమి చెప్పాలో తెలియదని ఏడుస్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ముందు చెప్పినట్లే అబద్ధాలు చెప్దాము బాబు. ముందు అయితే రండి.. శౌర్యను తీసుకువచ్చేద్దామంటూ రూమ్‌లోకి వెళ్లి దీప, కార్తీక్ షాక్ అవుతారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
డబ్బు కట్టలేదని పాపను పంపేశారా అనుకుంటూ.. కార్తీక్, దీప డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దీంతో అక్కడున్న నర్సు పాపను ఆపరేషన్ థియేటర్‌కి షిఫ్ట్ చేశారంటూ.. పాప వస్తువులు ఇస్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీప, కార్తీక్‌లకు తెలియకుండా అంత డబ్బు ఎవరు కట్టారో ఇద్దరికీ అర్థం కాదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)