Guppedantha Manasu Jyothi Rai: 'గుప్పెడంతమనసు'లో జగతిని చంపేస్తే ఆమె బయట ఇలా చంపేస్తోంది!
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్ర చాలా కీలకం. అసలు కథను నడిపించింది, మలుపులు తిప్పింది ఈ క్యారెక్టరే..
స్టూడెంట్ భవిష్యత్ కోసం తపించే గురువుగా, అమ్మా అనే పిలుపుకోసం ఆరాటపడే తల్లిగా, భర్త ప్రేమకోసం తపించే ఇల్లాలిగా... ఆరళ్లు ఎదుర్కొనే తోడికోడిలిగా..కాలేజీ ఎండీగా...జగతి క్యారెక్టర్ కి నూటికి నూరు మార్కులు
ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఇలాంటి ఓ లెక్చరర్ ఉంటే చాలు అనిపించేలా ఉంటుంది జగతి పాత్ర. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ సీరియల్ లో లేదు ... ఆమెను చంపేశారు...కానీ ఇప్పటికీ జగని నామస్మరణ లేనిదే సీరియల్ నడవడం లేదంటే ఎంత బలమైన క్యారెక్టరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు
ఓ వైపు వెబ్ సిరీస్ లు మరోవైపు రెండు మూడు సినిమా ఆఫర్లు కూడా జ్యోతిరాయ్ చేతిలో ఉన్నాయి
జగతి పాత్రకు పూర్తి భిన్నమైన గ్లామరస్ అవతార్ లో చూసి జనాలు షాక్ అవుతున్నారు.
1985 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించిన జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే
'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది.
జ్యోతిరాయ్ కు తన 20 ఏటలోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం అయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. - Image Credit: Jyothi Rai/Instagram
భర్తతో విడాకులు తీసుకున్న జ్యోతిరాయ్ యువ దర్శకుడు పూర్వజ్‌ని పెళ్లిచేసుకుంటుందనే వార్తలొచ్చాయి..