Devatha Arjun Ambati Photos: రియల్ లైఫ్ 'దేవత'తో ఆదిత్య(అర్జున్ అంబటి)

Image credit: Arjun Ambati/Instagram
అగ్నిసాక్షి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన అర్జున్ అంబటి ఇప్పుడు దేవత’ సీరియల్‌లో ఆదిత్యగా మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
‘అర్ధనారి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన అర్జున్ అంబటి ‘సౌఖ్యం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. కొంత గ్యాప్ తర్వాత 'సుందరి' సినిమాలో హీరోగా నటించాడు. పూర్ణ ఇందులో హీరోయిన్ గా నటించింది.
విజయవాడకు చెందిన అర్జున్ అంబటి రెండేళ్ల పాటు ఐటీ జాబ్ చేశాడు. ఈ సమయంలో హెచ్ ఆర్ ఉద్యోగి సురేఖతో పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంలో పెళ్లిచేసుకున్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ అయిన తన స్నేహితుడి సహకారంతో సినిమాల్లో అడుగుపెట్టాడు. పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఆశలేదన్న అర్జున్..విలక్షణ నటుడిగా మెప్పిస్తే చాలంటాడు.
సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ పై అదృష్టం పరీక్షించుకున్న అర్జున్ అటు ఓటీటీ వేదికపైనా సత్తా చాటుకుంటున్నాడు.
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)
అర్జున్ అంబటి (Image credit: Arjun Ambati/Instagram)