ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • బ్రహ్మముడి అక్టోబరు 04 ఎపిసోడ్ హైలెట్స్: అనామిక చెంప పగిలింది.. పెళ్లిఫొటోలకు నిప్పు పెట్టిన రాజ్!

బ్రహ్మముడి అక్టోబరు 04 ఎపిసోడ్ హైలెట్స్: అనామిక చెంప పగిలింది.. పెళ్లిఫొటోలకు నిప్పు పెట్టిన రాజ్!

RAMA Updated at: 04 Oct 2024 09:32 AM (IST)
1

ఎక్ పో సామంత్ గ్రూప్ కి అవార్డ్ రావడానికి కారణం కావ్య అని తెలిసిన రాజ్..ఆమె ఎంత చెప్పాలని ప్రయత్నించినా ఆవేశంతో ఊగిపోతాడు. నువ్వు డిజైన్లు వేసింది నిజం కాదా? నా ప్రత్యర్థి కంపెనీకి డిజైన్లు అమ్మింది నిజం కాదా? దానికి అవార్డ్ వచ్చింది నిజం కాదా అని ప్రశ్నిస్తాడు

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ప్రతివిషయంలోనూ అపార్థం చేసుకుంటూనే ఉన్నారు..మీరు నమ్మినా నమ్మకపోయినా కలలో కూడా మీకు ద్రోహం చేయను, నాపై నిందలు వేస్తూనే ఉన్నారు..మీ ఓటమి కోసం పనిచేశాను అంటున్నారు..దీని వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయో నాకు తెలియదు అంటుంది కావ్య

3

ఇదే అవకాశంతో రుద్రాణి రెచ్చిపోతుంది..కావాలనే నువ్వు శత్రువులతో చేయికలిపావ్. డబ్బుకోసం ఇంతకు దిగజారుతావా అని నోటికి పనిచెబుతుంది. ఇన్నాళ్లూ నేను చెబితే నమ్మని వాళ్లు ఇప్పుడేమంటారని అడుగుతుంది. నిజాలు తెలుసుకోకుండా ఇంకా ఎక్కువ చేయకండి అంటుంది కావ్య

4

నిన్ను కాపురానికి తెచ్చుకోవాలి అనుకున్నాడు..పదేళ్లుగా మాకే వచ్చే అవార్డ్ రానివ్వకుండా చేశావ్.. మా వదిన ఇంకా నిన్ను ఇంటికి తీసుకురావాలని అనుకుంటోంది అంటుంది రుద్ాణి. ఆ అనామిక ఏం చేసిందో తెలుసా అని కావ్య అంటే.. నిన్న మాపై ఉసిగొల్పింది నువ్ మోసపోయావ్..నన్ను మోసం చేశావ్ అని రాజ్ అంటాడు

5

నువ్వు నాకు మర్చిపోలేని గుణపాఠం నేర్పించావ్..నీపై ఏమూలో ఉన్న ప్రేమ చచ్చిపోయింది. ఇంకెప్పుడూ ఎదురుపడకు అని చెప్పేసి వెళ్లిపోతాడు. మావయ్యగారు అని సుభాష్ ని పిలుస్తుంది కానీ... వద్దమ్మా నాకేం చెప్పకు అనేసి వెళ్లిపోతాడు

6

ఇంతలో కంగ్రాట్స్ చెబుతూ ఎదురొస్తారు కావ్య, సామంత్.. ఎందుకు మీరు బిగించిన ఉచ్చులో అమాయకంగా చిక్కుకున్నందుగా అంటుంది కావ్య . నువ్వు చేసిన పనికి నేను నా భర్త మనసులో పాతాళంలో పడ్డాను అని బాధపడుతుంది. నీ క్యారెక్టర్ ఎందుకు పనికొచ్చింది..అక్కడున్నప్పుడు నేను బాధపడుతూనే ఉన్నాను..ఇప్పుడు చూడా ఎంత సంతోషంగా ఉన్నానో అంటుంది అనామిక

7

విడాకులు తీసుకున్న స్త్రీ రెండో పెళ్లి చేసుకోకూడదు అనుకోను..కానీ నీ విషయం వేరు..నువ్వు కేవలం దుగ్గిరాల కంపెనీ పతనం కోసమే సామంత్ దగ్గర చేరావని అర్థమైంది... పగకోసం పతమైపోతావ్ జాగ్రత్త అని హెచ్చరిస్తుంది కావ్య.

8

అసలు నా ఇష్టం లేకుండా నా డిజైన్స్ వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు. మోసం చేసి గెలిచారు. మోసపోయి నేను ఓడిపోయాను. నావల్ల దుగ్గిరాల వారికి వ్యాపారపరంగా నష్టం జరిగింది. కుటుంబపరంగా పరువుపోయిందని కావ్య అంటుంది. ఇప్పటికైనా మా కంపెనీతో చేయి కలుపు.. నీకు విలువనివ్వని ఆ కుటుంబాన్ని, సంస్థను పాతాళానికి తొక్కేద్దాం అంటుంది అనామిక..లాగిపెట్ట కొడుతుంది కావ్య

9

సామంత్ ని కూడా హెచ్చరించిన కావ్య.. వ్యక్తిత్వం లేని ఆడదాన్ని అడ్డుపెట్టుకుని ఓ సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తున్నావ్ .. దాని వేరు కూడా కదపలేరని త్వరలోనే తెలుస్తుంది అంటుంది కావ్య.

10

ఇంటికెళ్లిన రాజ్ ఆవేశంతో ఊగిపోతుంటే..అపర్ణ మాత్రం నా కోడలు అలా చేయదురా అంటుంది. ఇందిరాదేవి కూడా అదే మాట అంటుంది. అంతా నా కళ్లముందే జరిగిందంటాడు రాజ్. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని ప్రకాశం అంటాడు. రుద్రాణి మాత్రం మరింత నిప్పు రాజేస్తుంది.

11

ఆవేశంలో ఉన్న రాజ్...కావ్య దుస్తులు, పెళ్లి ఫొటోలకు నిప్పంటిస్తాడు...

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.