✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi October 15th Episode: కనకం డ్రామా తెలిసిన రాజ్ కావ్య విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు - బ్రహ్మముడి అక్టోబరు 15 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  15 Oct 2024 09:22 AM (IST)
1

కనకం - కృష్ణమూర్తి పెళ్లిరోజు వేడుకలకు వచ్చిన అప్పు కళ్యాణ్ ని చూసి మళ్లీ అప్పుపై నోరుపారేసుకుంటుంది ధాన్యలక్ష్మి. మా అమ్మ అంతే ఫీల్ అవొద్దని కళ్యాణ్ అంటే..కొడుకు దూరమైన ఏ తల్లి అయినా ఇలానే ఆలోచిస్తుందని చెబుతుంది అప్పు. ఇంత రచ్చ జరిగిన తర్వాత మా అమ్మ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో అర్థంకావడం లేదంటుంది. ఆ విషయం మీ అమ్మను అడుగు అని కళ్యాణ్ అంటే కడిగేస్తా అని లోపలకు వెళుతుంది అప్పు

2

ఆఫీసుకి వెళ్లిన రాజ్..కాల్ చేశావు కదా ఏంటో చెప్పు అని మేనేజర్ తో అంటే నేను కాల్ చేయడం ఏంటి..మీకు రాంగ్ నంబర్ నుంచి కాల్ వచ్చిందంటాడు. మన కంపెనీలో ఎక్సెస్ గోల్డ్ ఉందా అని శ్రుతిని అడిగితే అంతా చెక్ చేశాను ఏమీలేదంటుంది. ఎవరు కాల్ చేశారో కనుక్కుంటా అనుకుంటాడు రాజ్

3

కూల్ గా కూర్చున్న కనకంపై సెటైర్స్ వేస్తుంది అప్పు.. ఇంత గొడవ జరుగుతుంటే నీ పెళ్లిరోజు ఏంటని నిలదీస్తుంది. మీ బావగారు నాపై ప్రేమతో చేస్తున్నారు ఏం చేయమంటావ్ అంటుంది. ఇదంతా పెద్దమ్మే నడిపించిందని బంటి చెప్పబోతుంటే కనకం ఆపేస్తుంది.

4

ఇందిరాదేవి - అపర్ణ మాట్లాడుకుంటుంటే వినేందుకు ట్రై చేస్తుంది రుద్రాణి. రాహుల్ రావడంతో.. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థంకావడం లేదు..రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అని డౌట్ పడుతుంది.

5

అసలు మేనేజర్ నీకు ఫోనే చేయలేదనుకుంటా అని అపర్ణ అనగానే రాజ్ ... నీకెలా తెలుసు అంటాడు. ఆ ఫోన్ చేయించింది నేనే...ఆ రోజు కావ్య కూడా ఇలాంటి ఫేక్ కాల్ వస్తేనే నా పర్మిషన్ తీసుకుని వెళ్లింది. ఈ రోజు నీ అత్తగారి ఆఖరి కోరిక అని ఫంక్షన్ చేస్తున్నావ్ కానీ కంపెనీలో తప్పు జరుగుతోంది అనగానే వెళ్లిపోయావ్..నీకున్న నిబద్ధతే కావ్యకు ఉందని చెబుతుంది. ఒకప్పుడు కావ్యను ఎంతో ద్వేషించిన నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నానంటే తనని అర్థం చేసుకున్నానంటుంది అపర్ణ.

6

గుమ్మానికి పూలదండలు కడుతున్న కావ్యను చూసి తనని అన్నమాటలు తలుచుకుని ఫీలవుతాడు రాజ్. పూలు పైన తగిలించేందుకు ఇబ్బంది పడుతున్న కావ్యను ఎత్తుకుంటాడు రాజ్. దించండి అంటే..ఎత్తుకున్నది దించడానికి కాదంటాడు..భార్యను మధ్యలో వదిలేశారు అంటే నేను వదిలేయలేదు నువ్వే వచ్చేశావ్ అంటాడు. ఇద్దరూ మాటలతో ప్రేమగా పోట్లాడుకుంటారు.

7

పెళ్లి రోజు ఎర్పాట్లు చూసి రగిలిపోతుంటారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. రాజ్, కావ్య ఒకేసారి కేక్ తినిపించడానికి ట్రై చేస్తూ ఒకర్నొకరు చూస్తుండిపోతారు...

8

బ్రహ్మముడి అక్టోబరు 16 ఏపిసోడ్ లో...కావ్యకు రాజ్ కంకణం కడుతుంటే రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది.. మీ ఇద్దర్నీ కలిపేందుకు కనకం క్యాన్సర్ ఉన్నట్టు నాటకం ఆడిందని బయటపెట్టేస్తుంది..అక్కడున్నవారంతా షాక్ అవుతారు..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi October 15th Episode: కనకం డ్రామా తెలిసిన రాజ్ కావ్య విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు - బ్రహ్మముడి అక్టోబరు 15 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.