Brahmamudi October 10th Episode: 'పవిత్రబంధం' సినిమా స్టైల్లో ఊహించుకుంటున్న రాజ్ - నాటకం మొదలెట్టిన కనకం అండ్ కో!
రాజ్ - కావ్య ఓ దగ్గర ఉంటేకానీ ఇద్దరి మనసులో మాట బయటపడదు అనుకుంటారు ఇందిరాదేవి,అపర్ణ, కనకం. ఏం చేయాలో చెప్పమని కనకంని అడిగితే..నేను ఏం చేసినా అల్లుడు గారు రారు, నేను పోయినా రారు అంటుంది బాధగా. ఏం మాటలు అవి ఆపు అని ఇందిరాదేవి, అపర్ణ అంటే.. నిజంగానే నేను మూడు నెలలే బతుకుతాను అంటుంది
కనకం మాటలు విని వాళ్లు బాధపడిపోతారు..ఇంతవరకూ ఎందుకు చెప్పలేదని అపర్ణ అడిగితే ఎప్పుడూ అబద్ధాలు చెప్పే నేను నిజం చెప్పినా నమ్మరు అందుకే చెప్పలేదంటుంది. వాళ్లు పూర్తిగా నమ్మేసిన తర్వాత ఇదంతా యాక్షన్ అంటుంది కనకం. ఈ ప్లాన్ తో కావ్య-రాజ్ ని ఒక్కటి చేయాలి అనుకుంటారు ముగ్గురు
ఇలాంటి చచ్చు సలహా ఇచ్చినందుకు కనకాన్ని ఈడ్చికొట్టలాని ఉందని ఇందిరాదేవి అంటే..ఇది వర్కౌట్ అయ్యేలా ఉంది అత్తయ్య అంటుంది అపర్ణ. మరి నిజం తెలిస్తే అని డౌట్ పడుతుంది అపర్ణం... అడవిలో పసరు మందు మింగాను క్యాన్సర్ పోయిందని చెబుతా అంటుంది కనకం.
మా పెళ్లి రోజు ముగ్గురు కూతుర్లు, అల్లుళ్ల చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నా..అలా రాజ్ ను ఇంట్లో ఉంచే ఏర్పాటు చేస్తానంటుంది కనకం. ఈ ప్లాన్ రుద్రాణికి తెలియకుండా జాగ్రత్తపడాలి అనుకుంటారు ముగ్గురు..
కనకం-కృష్ణమూర్తి పెళ్లి రోజు వేడుకల గురించి చర్చ కావ్య తండ్రితో చర్చిస్తుంది. మీరు బాగోలేనప్పుడు మేం ఎలా పెళ్లి రోజు జరుపుకుంటాం అంటాడు కృష్ణమూర్తి..అప్పుడే వచ్చిన కనకం ... స్వప్న దగ్గరుండి మన పెళ్లిరోజు జరిపిస్తుందట అంటుంది. ఇలా అయినా కావ్య-రాజ్ కలుస్తారు కదా అని కనకం ఆశపడితే..దగ్గరవుతారో మరింత దూరం అవుతారో అంటాడు కృష్ణమూర్తి
రాజ్ వర్త్ చేస్తుండగా..ఈ విషయం చేరవేసేందుకు అత్తా-కోడలు నాటకం మొదలుపెడతారు. ఏం జరిగిందని రాజ్ అడిగితే.. కావ్య అంటుంది అపర్ణం.. తన గురించి చెప్పొద్దంటాడు రాజ్. వీడు మారడు అనుకుంటారు. ఇంతలో కనకం కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అంటుంది. ఇక్కడ ఫెయిల్ అని చెబుతారు
ప్రకాశానికి ఏమీ చెప్పకుండా.. పాపం కావ్య అని రాజ్ దగ్గర అనమంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఏం జరిగిందని రాజ్ అడిగినా ఏమో మర్చిపోయానని చెప్పు అంటారు. లీలావతి , గర్భవతి అంటూ ఏవేవే మాట్లాడుతాడు ప్రకాశం. రాజ్ లో టెన్షన్ పెరుగుతుంది..ఏం జరిగిందనే ఆలోచనలో పడతాడు.
జంగా కావ్య గర్భవతా.. అమ్మా-నానమ్మ ఎందుకు అంతలా బాధపడుతున్నారు అనుకుంటాడు. బ్రహ్మముడి అక్టోబరు 11 ఎపిసోడ్ లో కనకం చివరి కోరిక తెలుసుకునేందుకు వెళతాడు రాజ్