Brahmamudi Serial,Brahmamudi Today మే 28ఎపిసోడ్: రాజ్ కావ్యను ఇరికించిన అప్పు కళ్యాణ్..ధాన్యం రెచ్చిపో ఇక - బ్రహ్మముడి మే 28 ఎపిసోడ్ హైలెట్స్!
అప్పూ- కళ్యాణ్‌ల ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంటారు రాజ్ కావ్య. ఎక్కువ స్వీట్స్, పూలు తీసుకురావడంతో కావ్య మండిపడుతుంది. రొమాంటిక్ ఫీల్ లేదని కావ్యతో గొడవపడతాడు రాజ్. ఏం చేయాలేంటని సెటైర్ వేస్తుంది. మనసులో మాట చెప్తే చాలంటాడు రాజ్.
నా మనసులో ఏమీ లేదు అనేస్తుంది కావ్య. దూరంగా ఉన్నప్పుడు నాపై కోపం చూపించి దగ్గరకు రాగానే తడబడే మీ మాటలకు, మనసుకి ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. కావ్యకు తన మనసులో మాట చెబుతుండగా వస్తారు కళ్యాణ్, అప్పు.
దొంగ తప్పించుకున్న విషయం చెప్తారు. వెంటనే బయటకు వెళ్లాలని చెప్పి మీరే సహాయం చేయాలని అడుగుతారు అప్పు, కళ్యాణ్. అనుకున్న ప్రకారం మీరిద్దరూ గదిలోకి అడుగుపెట్టండి. ఆ తర్వాత ఇటువైపున్న తలుపులోంచి బయటకు వెళ్లిపోండి అని సలహా ఇస్తాడు. మేం లోపల లేం అని తెలిస్తే అమ్మ ఊరుకోదు అనగానే..నేను కళావతి ఉంటాం అంటాడు రాజ్
నేను చిన్నత్తయ్యని మోసం చేయలేను కావాలంటే నేను మాట్లాడుతా అంటుంది కావ్య. వాళ్లు ప్రయత్నం చేసి వర్కౌట్ కాకపోవడం వల్లే ఇక్కడకు వచ్చారు అంటాడు రాజ్. దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టేసి తిరిగి వచ్చేస్తాం అంటాడు కళ్యాణ్
ముందు నువ్వు వెళ్లు తర్వాత అప్పు వస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. చేసిన డెకరేషన్ అంతా వేస్ట్ అయిపోతోందే అని బాధపడతాడు కళ్యాణ్. రాజ్ గందరగోళంగా మాట్లాడడం చూసి రుద్రాణికి డౌట్ వస్తుంది.
ఎంతో సంతోషంగా జరగాల్సిన మన ఫస్ట్ నైట్ నావల్ల ఆగిపోయిందని చెప్పి బాధపడుతుంది అప్పు. కళ్యాణ్ కి సారీ చెబుతుంది. పోలీస్ అవడం నీ కల..అందుకోసం ఎంత కష్టపడ్డామో నీకు తెలుసు. ఈ ముహూర్తం కాకపోతే మరో మూహుర్తం పెట్టుకోవచ్చు. జాబ్ లేకపోతే జీవితాంతం ఇంట్లోనే కూర్చోవాలి అంటాడు. మా అమ్మ కూడా ఇంతలా అర్థం చేసుకోలేదని కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది అప్పు
అప్పుడే లోపలకు ఎంట్రీ ఇచ్చిన కావ్య-రాజ్ మేం ఏమీ చూడలేదంటారు. ఇంత లేటుగా వస్తారా అని అడిగితే..మీ అమ్మను దాటుకుని రావాలిగా అంటాడు రాజ్. త్వరగా వచ్చేయండి అని చెప్పి వాళ్లను పంపిస్తారు.
డ్రెస్ మార్చుకునేందుకు కావ్య రూమ్ లోకి వెళుతుంది అప్పు..నగలు కొట్టేసేందుకు ఇదే మంచి టైమ్ అని ఫాలో అవుతాడు రాహుల్.
అప్పూ - కళ్యాణ్‌లు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి మనం శోభనం ఎలా చేయాలో రిహార్సల్స్ చేద్దాం అని రాజ్ అనగానే ఫైర్ అవుతుంది కావ్య. అప్పు కళ్యాణ్ మాట్లాడుకుంటున్నట్టు ఆడియో ప్లే చేద్దాం అనుకుంటారు
బ్రహ్మముడి మే 29 ఎపిసోడ్ లో..కళ్యాణ్-అప్పు ఇంట్లోంచి వెళ్లడం చూస్తుంది ధాన్యలక్ష్మి .. తిరిగి వచ్చిన అప్పు-కళ్యాణ్ ని నిలదీస్తుంది. రాజ్ కావ్య ఎక్కడ అని అడిగితే.. వాళ్లు మా గదిలో ఉన్నాంటుంది అప్పు. రూమ్ లోకి వెళతారు దుగ్గిరాల ఫ్యామిలీ...