Brahmamudi Serial Today March 3rd Episode Highlights :బ్రహ్మముడి సీరియల్ శుభం కార్డ్ కి ఇంకా టైముంది..కొత్త విలన్ వచ్చింది - బ్రహ్మముడి మార్చి 3 ఎపిసోడ్ హైలెట్స్!!
బ్రహ్మముడి సీరియల్ కి త్వరలోనే శుభంకార్డ్ పడుతుందనే డిస్కషన్ జరిగింది. అనామికకు చెక్ పెట్టడంతో శుభమే అనుకున్నారు
కోమాలోంచి సీతారామయ్య కోలుకుని వచ్చారు. దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డుమీదకు ఈడ్చుదాం అనుకున్న అనామిక సామంత్ తో చేయికలిపింది
సామంత్ కూడా రాజ్ ని కొట్టేందుకు అనామికను అడ్డుపెట్టుకున్నాడు..తీరా అనామిక చేతిలోనే హత్యకు గురయ్యాడు
పోయిందనుకున్న ఆస్తి చేతికొచ్చింది..ప్రధాన శత్రువైన అనామిక సామంత్ హత్య కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తోంది
ఇక సీరియల్ లో మిగిలింది రుద్రాణినే కాబట్టి..ఈ దెబ్బకి మొత్తం సెట్టైపోతుంది..ఇక శుభం కార్డే అనుకున్నారు
సమస్య మరోరూపంలో రాదని గ్యారంటీ ఏంటి అని రుద్రాణి అనగానే కొత్త పిల్ల ఎంట్రీ ఇచ్చింది...
స్టైలిష్ గా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది.. ఆ ఫేస్ చూసి రాజ్ షాక్ అయినట్టు చూపించారు
ఎవరా కొత్త అమ్మాయి.. దుగ్గిరాల కుటుంబానికి ఆమెకు ఏంటి సంబంధం..బ్రహ్మముడి ఎలాంటి మలుపులు తిరగబోతోంది?