Brahmamudi January 3rd Episode: భారీ స్కెచ్ వేసి ఫెయిలైన రాజ్ కావ్య.. తప్పించుకుపోయిన నందగోపాల్ - బ్రహ్మముడి జనవరి 3 ఎపిసోడ్ హైలెట్స్!
లిఫ్ట్ అడిగిన సావిత్రి..కావ్యను పొగడ్డం మొదలుపెడతాడు. రాజ్ రివర్స్ ఆడుకుంటాడు. నిన్ను కిడ్నాప్ చేశాం అంటాడు. భయపడిన సావిత్రి కార్లోంచి దూకేస్తాడు. నా భార్య చేయి పట్టుకుంటావా అని మరి అని రాజ్ అనుకుంటాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనందగోపాల్ గెస్ట్ హౌజ్ దగ్గరకు వెళతారు రాజ్ అండ్ కావ్య. ఇది చూస్తుంటే నాకు బూత్ బంగ్లా గుర్తొస్తోంది అంటుంది. మళ్లీ మళ్లీ ఎందుకు గుర్తుచేస్తావ్ అంటాడు. లోపలకు వెళుతున్న రాజ్ ని సెక్యూరిటీ ఆపితే నేను మీఎండీ ఫ్రెండ్ ని గుర్తుపట్టలేదా అని నమ్మించేందుకు ప్రయత్నిస్తాడు.
నేను లేకుండా గతంలో ఎవరితో ఎన్నిసార్లు వచ్చారని కావ్య అంటుంది. నాకు అంతసీన్ లేదే..నువ్వు వాడికి డౌట్ వచ్చేలా చేయకు అని కవర్ చేస్తాడు. మీ సర్ కి డబ్బులివ్వాలిలే అని చెప్పి..నన్ను లోపలకు పంపించకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుందని బెదిరిస్తాడు. రాజ్ మాటలకు సెక్యూరిటీ భయపడి లోపలకు పంపిస్తాడు.
రుద్రాణి-ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటుంటే ప్రకాశం సెటైర్లు వేస్తాడు. మీరిద్దరూ ఎక్కడికో బయలుదేరినట్టున్నారని అంటే.. నిధి నిక్షేపాల కోసం సటైర్ వేస్తుంది అపర్ణ. కార్లు లేవుకదా అంటే సుభాష్ వస్తారు అంటుంది. ఇంతలో సుభాష్ వచ్చి కారు బ్రేక్ డౌన్ అయింది క్యాబ్ లో వచ్చాను అంటాడు. మళ్లీ నోరు పారేసుకుంటారు ధాన్యం, రుద్రాణి
మీరంత జాలి పడాల్సిన అవసరం లేదు..నా బావని చూసేందుకు ఆటోలో వెళతాం పర్వాలేదు అంటుంది ఇందిరాదేవి. గొప్పగా ఉండే మన బతుకుల్ని రోడ్డున పడేశారు..రిచ్ ఫుడ్ లేదు, కార్లు లేవు, క్రెడిట్ కార్డ్స్ లేవు అంటూ హడావుడి చేస్తారు. మా అత్త పాయే, మా ఆయన పాయే అంటూ సెటైర్ వేస్తుంది స్వప్న.
ఇది నిజంగా నందగోపాల్ గెస్ట్ హౌసేనా మరో బూత్ బంగ్లా ప్లాన్ వేశారా అంటుంది కావ్య. నన్ను మోసం చేసి నా జీవితంలో నిప్పులు పోశారు అంటుంది. రెండో శోభనాన్ని ఏ గదిలో ప్లాన్ చేశారని అడిగితే రాజ్ కోప్పడతాడు. ముందు ఆ నందగోపాల్ గాడు వచ్చేలోగా ఏవైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం అంటాడు
డాక్యుమెంట్స్ వెతుకుతూ ఉండగా ఓ రూమ్ ఫస్ట్ నైట్ కోసం డెకరేట్ చేసి ఉంటుంది. మీ ప్లాన్ నాకు అర్థమైందని కావ్య అంటే నాకేం తెలియదు అంటాడు రాజ్. మీరూ అనుకుంటూ వెళ్లి జారి పడుతుంది రాజ్ పట్టుకోవడంతో ఇద్దరూ బెడ్ పై పడతారు. ఆ తర్వాత కారు సౌండ్ రావడంతో వాడు వచ్చినట్టున్నాడని తేరుకుంటారు
గెస్ట్ హౌజ్ లో రాజ్ కావ్యను చూసి షాక్ అవుతాడు నందగోపాల్. మా తాతయ్య మిమ్మల్ని నమ్మి వంద కోట్లకు షూరిటీ పెడితే మోసం చేసి తప్పించుకు తిరుగుతావా..నీ నుంచి వందకోట్లు రాబట్టడంతో పాటూ నీ ఆస్తులన్నీ బయటపెడతా అని బెదిరిస్తాడు రాజ్. నందగోపాల్ ని వాయించేస్తాడు.
నందగోపాల్ రాజ్ ను వెనక్కు తోసేసి పారిపోతాడు. వాడిని అనుసరిద్దాం అనుకుంటే కారులో పెట్రోల్ అయిపోవడంతో కారు స్టార్ట్ కాదు. దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు అనుకుంటాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ ని పిలిచి నందగోపాల్ ఎక్కడుంటాడని అడిగితే ...ఏమో తెలియదు వాడు పిలిచాడు నేను వచ్చానంటూ చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది
బ్రహ్మముడి జనవరి 04 ఎపిసోడ్ లో...కార్ల కోసం ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కావ్యతో మళ్లీ వాదనకు దిగుతారు. నాకు సర్వహక్కులు తాతయ్య ఇచ్చారు..మీకు నచ్చినా నచ్చపోయినా నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే అని ఫైర్ అవుతుంది