Brahmamudi January 18th Episode: వంద కోట్ల విషయం రుద్రాణికి చెప్పేసిన అనామిక .. పూర్తిగా ఇరుక్కుపోయిన రాజ్ కావ్య - బ్రహ్మముడి జనవరి 18 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్య నగలు తాకట్టు పెట్టిన విషయం బయటపెట్టి రచ్చ చేసింది రుద్రాణి. దుగ్గిరాల వారి వంశ గౌరవాన్ని కోరుకునే దానివే అయితే ఈ విషయం నలుగురి ముందు బయటపెట్టేదానివి కాదని రాజ్ ఫైర్ అవుతాడు.
కావ్యను నగలు తాకట్టు పెట్టమన నేనే చెప్పాను అంటుంది అపర్ణ. కంపెనీ అకౌంట్స్ అన్ని హోల్డ్‌లో పెట్టడంతో హాస్పిటల్ బిల్ కట్టకపోతే పరువు పోతుందనే అలా చేయమని చెప్పాను అంటుంది. నీకోడల్ని కాపాడేందుకు ఇలా చెబుతున్నావని అర్థమైందంటుంది రుద్రాణి. ఔను ఐతే నేను చెప్పింది అబద్ధమని రుజువు చేయ్ అని సవాల్ విసురుతుంది అపర్ణ
ఈడ్చి కొడితే రోడ్డుపై పడే బతుకులు మీవి..నువ్వు నీ కొడుకు కలసి మమ్మల్ని ఈ కనకం కుటుంబాన్ని ఏ హక్కుతో నిలదీస్తున్నావ్ అని ఫైర్ అవుతుంది. రుద్రాణి అన్నిసార్లు అడిగితే నిజం ఎందుకు చెప్పలేదంటుంది ధాన్యలక్ష్మి. నాకు విజ్ఞత ఉంది అందరి ముందూ అందుకే చెప్పలేదంటుంది అపర్ణ
అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతారు రుద్రాణి, రాహుల్. కృష్ణమూర్తి బతిమలాడినా కానీ ఆగకుండా వెళ్లిపోతారు
అసలు కారణం ఏంటని నిలదీస్తుంది అపర్ణ. కావ్య చెప్పేందుకు అంగీకరించదు..మీ నమ్మకం పోగొట్టుకోను అంటుంది. కావ్య ఇంటి మంచి కోసమే కదా చేస్తుందని అంటుంది ఇందిరాదేవి. మీ అబ్బాయి నేను ఇంటి మంచికోసమే కష్టపడుతున్నాం అంటుంది కావ్య.
ఈ బాధ్యతలు మోయలేను అన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన మీరు ఇఫ్పుడు ఇలా నిలదీయడం భావ్యంగా లేదంటుంది కావ్య. ఇంట్లో సంక్షోభం ఎందుకొచ్చిందో చెప్పాల్సిన బాధ్యత నీకుంది..అడగాల్సిన బాధ్యత నాకుంది అయినా నువ్వు చెప్పకుండా తప్పించుకుని వెళ్లిపోతున్నావ్ అంటుంది అపర్ణ
నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నాతో మాట్లాడకు అంటుంది అపర్ణ. ఇంత జరుగుతున్నా కావ్య చెప్పడం లేదంటే అదేదో పెద్ద సమస్యే తెలుసుకుని తీరాలి అనుకుంటుంది ఇందిరాదేవి
జరిగినదంతా తెలుసుకుని రాజ్ కావ్య బాధపడతారు. మీ రుద్రాణి అత్త ఏదో గొడవ తెచ్చి మన నెత్తిన పెడుతోందని బాధపడుతుంది కావ్య. నిజం చెప్పడమే సమస్యలకు పరిష్కారం అని రాజ్ అంటాడు. నిజం చెబితే ఏం జరుగుతుందో ముందే ఊహించి చెబుతుంది కావ్య..
రుద్రాణి, ధాన్యలక్ష్మి ఎలా చెలరేగిపోయారో... ఇందిరాదేవికి హార్ట్ అటాక్ వస్తుందని ముందే భయపెట్టేస్తుంది కావ్య. వణికిపోయిన రాజ్ అమ్మో వద్దు అంటాడు..ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయింది...
బ్రహ్మముడి జనవరి 20 సోమవారం ఎపిసోడ్ లో... కావ్య దగ్గరకు వచ్చిన ఇందిరాదేవి నగలు ఇస్తుంది. నేను నీకు తోడుంటాను తీసుకో అంటుంది. వాళ్లు ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు చేస్తున్నారనే రచ్చ చూద్దాం అంటూ రుద్రాణికి కాల్ చేస్తుంది అనామిక. మొత్తం జరిగింది చెప్పేస్తుంది