Brahmamudi Serial Update: అప్పు కళ్యాణ్ vs అనామిక సామంత్... ప్రేమ-పంతం ఏది గెలుస్తుంది - బ్రహ్మముడి ఎపిసోడ్ హైలెట్స్!
బ్రహ్మముడి సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది.. ఓవైపు కావ్య ఇంటినుంచి వచ్చేయడంతో అటు దుగ్గిరాలవారింట రచ్చ రచ్చగా ఉంది. మరోవైపు కావ్యను ఉపయోగించుకుని దుగ్గిరాల వారి వ్యాపారాలను దెబ్బకొట్టాని అనామిక భావిస్తోంది..రీ ఎంట్రీ ఇవ్వడంతోనే అప్పు , కళ్యాణ్ తో గొడవకు దిగింది.
దుగ్గిరాల వారి వ్యాపారాన్ని పడగొట్టితీరుతాం అని సామంత్ తో కలసి శపథం చేసింది.. అది జరిగేపనికాదులే అని అప్పు -కళ్యాణ్ రివర్స్ పంచ్ ఇచ్చారు. అదే పంతంతో సామంత్ కంపెనీలో అడుగుపెట్టిన అనామిక కావ్య అమ్మే డిజైన్లు తమకు దక్కేలా ప్లాన్ చేసింది
ఇప్పుడు అనామిక కుట్రకు కావ్య బలికాబోతోంది..ఏకంగా దుగ్గిరాలవారింటింతి దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని అప్పు ఏమైనా ముందే పసిగడుతుందా? కళ్యాణ్ కి ఏమైనా తెలిసి హెచ్చరిస్తాడా...
బ్రో..మళ్లీ రోడ్డుపై కలుసుకుందాం ఈ అనామిక నిన్ను రోడ్డుకి ఈడ్చేస్తుందని అప్పు ..సామంత్ ని గట్టిగానే హెచ్చరించింది. పైగా అనామిక చేతిలో అవమానం ఎదుర్కొన్న అప్పు-కళ్యాణ్ పంతంపట్టి ఎదిగే అవకాశం ఉంది.
మరి అనామిక కుట్రను కావ్య పసిగడుతుందా? నిండా మునిగాక మేల్కొంటుందా? తన అత్తింటివారికి తనకు తెలియకుండా ద్రోహం చేస్తున్నానని ఎప్పుడు గుర్తిస్తుంది? దుగ్గిరాల వారి కుటుంబం కావ్యను మళ్లీ అపార్థం చేసుకోకతప్పదా?
సెప్టెంబరు 23 నుంచి బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది....