Brahmamudi Anamika Photos: 'బ్రహ్మముడి' సీరియల్ లో తప్పుల మీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోయే అనామిక మేకప్ లేని లుక్ ఇదిగో!
బ్రహ్మముడి సీరియల్ లో అనామికగా నటిస్తోన్న నిఖితా చౌదరి..రుద్రాణి తర్వాత విలన్ గా చెలరేగిపోతోంది. తన పుట్టింటికి డబ్బు చేరవేసేందుకు ఇంట్లో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన అనామిన.. అత్త ధాన్యలక్ష్మి సపోర్ట్ తో బయపడుతుంది. అయినప్పటికీ బుద్ధి లేకుండా దొంగతనం చేసిన చెక్ పుట్టింటికి పంపించే ప్లాన్ చేస్తుంది...అంటే ఇప్పట్లో అనామికలో మార్పు వచ్చేలా లేదు. సీరియల్ లో నెగిటివ్ రోల్ అయినా రియల్ గా మాత్రం టీమ్ తో కలసి సెట్ లో సందడి చేస్తుంటుంది...
సీరియల్ లో కూల్ లుక్ లో కనిపించే అనామిక...మేకప్ లేకుండా ఎలా ఉంటుందో కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాస్తవానికి మేకప్ ఉన్నా లేకున్నా నిఖితా చౌదరి లుక్ లో పెద్దగా మార్పులేమీ లేవు...
కవి కళ్యాణ్ కవితలకు పడిపోయి తన వెంటపడి ప్రేమించి పెళ్లిచేసుకున్న అనామిక..సీరియల్ లో విలన్ రుద్రాణి మాయలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటోంది...
బ్రహ్మముడి సీరియల్ కి ముందు నిఖితా చౌదరి ..ఇంటికిదీపం ఇల్లాలు సీరియల్ లో నటించింది
ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో పాటూ జాబిల్లికోసం ఆకాశమల్లే లో నటిస్తోంది... సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన సీరియల్ టీమ్ తో కలసి రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది అనామిక