Payal Rajput Photos: తక్కువ బాధపడండి ఎక్కువ ఆనందించండి ఏ పనైనా ప్రేమగా చేయండి - పాయల్ ని ఫాలో అయిపోండి!
RX 100 సినిమాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్..మంగళవారం మూవీతో మరోసారి సక్సెస్ అందుకుంది. లేటెస్ట్ గా రక్షణ సినిమాతో పోలీస్ ఆఫీసర్ గా వచ్చింది...
ఢిల్లీకి చెందిన పాయల్ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసి కొంతకాలం యాంకర్ గా పనిచేసింది...ఆ తర్వాత సీరియల్ ఆర్టిష్టుగా కెరీర్ ప్రారంభించి చాలా సీరియల్స్ లో నటించింది
పంజాబీ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఆ తర్వాత ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో జీవించేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది కానీ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు..
మంగళవారం మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పాయల్ ... దర్శకుడు ప్రణదీప్ తెరకెక్కించిన రక్షణలో నటించింది..మరికొన్ని ఆఫర్స్ ఆమె చేతిలో సిద్ధంగా ఉన్నాయి..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసిన పాయల్.. ' Worry less. Smile more', 'Do All things with Love' అంటూ పోస్ట్ పెట్టింది
పాయల్ రాజ్ పుత్ (image credit :Payal Rajput/Instagram)