Brahmamudi June 7th Episode: రాజ్ కావ్యని కాపాడిన అప్పు, మరో షాక్ కి సిద్ధంగా ఉండండి అన్న రుద్రాణి - బ్రహ్మముడి జూన్ 7 ఎపిసోడ్ హైలెట్స్!
అడవిలో పిచ్చి పండ్లు తిని మత్తులో తూగుతుంటారు రాజ్ కావ్య.. కన్యాకుమారి కనపడదా దారి సాంగేసుకుని పడిపోతారు
ఇంతలో కిల్లర్స్ ఎంట్రీ ఇచ్చి కత్తి తీసుకుని కావ్యను పొడిచేస్తారు..అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇస్తుంది
ఉదయం అయినా కావ్య-రాజ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కంగారుపడతారు. ఆ యామిని పంపిన మనుషులు వాళ్లని చంపేసి ఉంటారని సంబరపడుతుంది రుద్రాణి. ఇందిరాదేవి సహా ఇంట్లో వాళ్లంతా క్లాస్ వేసి రుద్రాణి నోరు మూయిస్తారు
కావ్యని చంపారా? లేదా? ఇంకా కాల్ రాలేదేంటని కంగారుపడుతుంటుంది యామిని. ఇంతలో వైదేహి రావడంతో విసుక్కుంటుంది. కావ్యను చంపమని రౌడీలకు సుఫారీ ఇచ్చానంటుంది యామిని..షాక్ అవుతుంది వైదేహి
రాజ్ స్పృహలోకి రాగానే అడవిలో కాకుండా ఎక్కడో కనిపిస్తారు. ఎదురుగా రౌడీలు చెట్టుకు కట్టేసి ఉంటారు. కంగారుగా కావ్యను నిద్రలేపుతాడు. ఆ రౌడీలను కట్టేసింది ఎవరు అని ఇద్దరూ అనుకుంటారు
రౌడీలు మీపై అటాక్ చేస్తున్న టైమ్ కి అక్కడకు వచ్చి కాపాడాను..వాళ్లను తీసుకొచ్చి చెట్టుకి కట్టేశాం...మత్తులో ఉన్న మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాం అంటుంది అప్పు. రౌడీ వెధవలు ఎందుకు మీ వెంట పడ్డారని అడిగితే..జరిగినదంతా చెబుతుంది కావ్య
ఇంటికి వచ్చిన కావ్యను చూసి హమ్మయ్య అనుకుంటారంతా. ఇంతకీ నా మనవడు తన మనసులో మాట చెప్పాడా అని అడిగితే ఏమీ చెప్పలేదు అంటుంది కావ్య. అపర్ణ, ఇందిరాదేవి డల్ అయిపోతారు. మీపై దాడిచేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీనిపై ఎంక్వైరీ చేయాలి అంటాడు సుభాష్. తప్పకుండా మావయ్య అంటుంది అప్పు.
అంతా సంతోషంగా ఉండడం చూసి రుద్రాణి, రాహుల్ కుళ్లుకుంటారు. ఎంత నువ్వుకున్నా రేపటివరకే అనుకుంటుంది రుద్రాణి. యామిని ఇచ్చే సర్ ప్రైజ్ కి మీ గుండెలు పగిలిపోతాయి అంటుంది
ఇంటికి వచ్చిన రాజ్..ఇల్లంతా డెకరేషన్ చూసి ఏంటిదంతా అని అడుగుతాడు. ఎల్లుండే మీ పెళ్లి అంటారు. షాక్ అవుతాడు
బ్రహ్మముడి జూన్ 09 ఎపిసోడ్ లో ... ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదంటాడు రాజ్. నువ్వు నా లైఫ్ లో ఉండనప్పుడు ఈ లైఫ్ నాకు అవసరం లేదంటూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది యామిని. అంతా కలసి రాజ్ ని బెదిరిస్తారు..