Brahmamudi Serial Today June 26th Episode: దుగ్గిరాల ఫ్యామిలీకి రేవతికి ఏంటి సంబంధం, యామిని మరో స్కెచ్ - బ్రహ్మముడి జూన్ 27 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్య దగ్గరికి బయల్దేరుతున్న అప్పూని పిలిచిన రాజ్..మీ అక్క కాల్ చేసిందా అని అడుగుతాడు. ఎవరికీ చెప్పొద్దు అన్నమాట గుర్తొచ్చి లేదు అని అబద్ధం చెబుతుంది అప్పు.
నువ్వే కాల్ చేసి అడుగు అంటారు అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్. తను ఏదో ముఖ్యమైన పనిలో ఉంటేనే అలా మాట్లాడుతుంది తనని ఇబ్బంది పెట్టను అంటాడు రాజ్. ఇవాళ కాకపోతే రేపైనా తన ప్రేమను చెబుతాను అంటాడు. అంతా కావ్య వల్లే అని లోలోపలే కోప్పడుతుంది అపర్ణ. హమ్మయ్య రాజ్ ప్రపోజ్ చేయలేదని సంబరపడుతుంది రుద్రాణి
ఇంటి డోర్ ఎవరో కంగారుగా కొడుతుండగా లోపలున్న రేవతి, కావ్య, స్వప్న టెన్షన్ పడతారు.మీరు దాక్కోండి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది రేవతి. బయట తన భర్తని చూసి హమ్మయ్య అనుకుుంటుంది. లోపలకు వచ్చిన తర్వాత తన భర్తని కావ్య, స్వప్నకు పరిచయం చేస్తుంది
ఇంతలో అప్పు వచ్చేస్తుంది. స్వప్న, కావ్య బయటకు రావడం రౌడీలు చూస్తారు కానీ పక్కనే పోలీసులు ఉండడంతో భయపడతారు. రేవతికి థ్యాంక్స్ చెబుతారు. రుణం తీర్చుకోలేమని స్వప్న అంటే..మనది తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదంటుంది రేవతి. కావ్య , స్వప్న షాక్ అుతారు
కావ్య, స్వప్న తప్పించుకున్నారని యామినికి కాల్ చేసి చెబుతారు రౌడీలు. నేను అనుకున్నది సాధించానులే..మీరు ఇంటికి వెళ్లిపోండి అంటుంది యామిని.
మనింటికి వచ్చింది దుగ్గిరాల వారింటి కోడళ్లు..నువ్వు ఎవరో ఎందుకు చెప్పలేదని భర్త అడుగుతాడు. నేను ఆ కుటుంబానికి మాయని మచ్చగా మారాను ఎలా చెబుతాను అంటుంది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈరోజు మీరంతా కలసి ఉండేవారు అంటాడు భర్త. మిమ్మల్ని దూరం చేసుకుని సంతోషంగా ఉండేలేను అంటుంది రేవతి
ఆ యామినిని వదిలిపెట్టొద్దంటుంది స్వప్న. మీరు సైలెంట్ గా ఉండండి అంటుంది కావ్య. ఇంటి దగ్గర కారు దిగకుండా నేరుగా యామిని దగ్గరకు వెళుతుంది అప్పు.
దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్యని రౌండప్ చేసి వరుస ప్రశ్నలు సంధిస్తారు. జరిగినదంతా స్వప్న చెబుతుంది.. ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. అంతటికీ కారణం యామిని అని చెబుతారు
స్వప్న కిడ్నాప్ విషయం నీకు ముందే తెలుసా అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. అందుకే నిన్ను తనతో వెళ్లకుండా ఆపాను అంటుంది రుద్రాణి. రాజ్ తన సొంతం అయ్యేవరకూ యామిని ఆట ఆడుతూనే ఉంటుంది అంటాడు రాహుల్
యామిని ఇంటికెళ్లిన అప్పూ లాగిపెట్టి కొడుతుంది. మా స్వప్న అక్కని కిడ్నాప్ చేయించి కావ్య అక్కని బెదిరించింది నువ్వే అని నాకు తెలుసు అంటుంది అప్పూ
బ్రహ్మముడి జూన్ 28 ఎపిసోడ్ లో రాజ్ ప్రపోజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటాడు..స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సమస్య సృష్టించేందుకు యామిని స్కెచ్ వేస్తుంది