Brahmamudi Serial Today June 21st Episode:ప్లాన్ మొత్తం రివర్స్ చేసిన యామిని, దోషిగా నిలబడిన అప్పు - బ్రహ్మముడి జూన్ 21ఎపిసోడ్ హైలెట్స్!
యామిని-రాజ్ పెళ్లి చేసుకుంటుంటే మీరంతా ఎందుకు పట్టించుకోవడం లేదంటుంది రుద్రాణి. కావ్య నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావేంటి అని ప్రశ్నిస్తుంది. నేను ఈ పెళ్లి ఆపను...కానీ..ఆగిపోతుంది అంటుంది కావ్య.
అపర్ణ, ఇందిరాదేవి, కనకం, స్వప్న, అప్పు, కళ్యాణ్ అంతా కూడా ఈ పెళ్లి కాసేపట్లో ఆగిపోతుందిలే అని ధీమాగా ఉంటారు. కానీ ఇంకా పోలీసులు , రౌడీ రాకపోవడంతో కంగారుపడుతుంటారు
పోలీసులు మండపానికి రావడం చూసి..ఇక దొరికిపోయాం ఈ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడాలి అనే ఆలోచనతో పెళ్లి ఆపండి అని డ్రామా చేస్తుంది. ముత్తైదువులు రావాల్సిన మండపానికి పోలీసులు ఎందుకొచ్చారని అడుగుతుంది
యామిని కుట్రను మొత్తం బయటపెడతారు.. కళావతిని చంపించేందుకు ప్లాన్ చేసిందని చెబుతాడు పోలీసు. రౌడీను తీసుకొచ్చి నిజం చెప్పమంటే..యామిని ఎవరో నాకు తెలియదు అనేస్తాడు.
కళావతి-రామ్ ఫ్రెండ్స్ కదా తనని చంపించాల్సిన అవసరం యామినికి ఏంటి అంటుంది రుద్రాణి. తను మా అక్క చుట్టూ తిరగడం చూసి తట్టుకోలేక ఇలా ప్లాన్ చేసిందని చెబుతుంది అప్పు
రౌడీ ఎవరో తెలియదు అన్నది కదా..వీడియో ప్రూఫ్ ఉందని చూపించేందుకు ట్రై చేస్తారు అప్పు, కళ్యాణ్. వీడియో కనిపించకపోవడంతో షాక్ అవుతారు
అప్పు కళ్యాణ్ రూమ్ కి వెళ్లి అర్థరాత్రి..ఫోన్లో వీడియో డిలీట్ చేస్తాడు రాహుల్. రుద్రాణి హమ్మయ్య అనుకుంటుంది
ఇంకా ఎందుకు లేట్..ఆ వీడియో కూడా నేనే డిలీట్ చేశాననే కొత్త కథ చెప్పు అని ఫైర్ అవుతుంది యామిని. నువ్వు చెప్పింది వినడానికి రెడీగా ఉన్నాం ఏం చెబుతావో చెప్పు అంటుంది యామిని.
అప్పు నువ్వు చెప్పింది ఏదీ ప్రూవ్ చేయలేకపోయావ్..ఏంటి ఇదంతా అని రాజ్ నిలదీస్తాడు
బ్రహ్మముడి జూన్ 23 ఎపిసోడ్ లో... యామిని తప్పు చేయలేదని నమ్ముతున్నప్పుడు పెళ్లిచేసుకోండి రామ్ అంటుంది కావ్య. తాళికట్టినట్టు మంత్రాలు వినిపిస్తాయి..